ట్రిపుల్ ఆర్ ఇప్పుడు ఇదే ఆడియన్స్ లో హాట్ టాపిక్. ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఒకే స్క్రీన్ పై సందడి చెయ్యడం, దానిని చూసేందుకు రెండు కళ్ళు చాలవనేలా ఉన్నాయి ట్రిపుల్ ఆర్ టీం ఇచ్చే ట్రీట్స్. మార్చ్ 18 నుండి ఆరు రోజులు తొమ్మిది సిటీస్ లో ట్రిపుల్ ఆర్ చేసే హడావిడి, హంగామా ఓ రేంజ్ లో ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి ఇంకా టీం దుబాయ్ లో ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్ లో పాల్గొనడమే కాదు ఆ నెక్స్ట్ డే మార్చి 19 న మరో ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఇలా తొమ్మిది సిటీస్ లో ట్రిపుల్ ఆర్ హంగామా ఉండబోతుంది. ఆర్.ఆర్.ఆర్ బుక్ మై షో లో అడ్వాన్స్ బుకింగ్ తో అప్పుడే రికార్డులు వేట మొదలు పెట్టింది. తాజాగా ట్రిపుల్ ఆర్ సెన్సార్ సర్టిఫికెట్ ని రివీల్ చేసింది టీం.
సెన్సార్ బోర్డు ట్రిపుల్ ఆర్ సినిమాకి యు/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ట్రిపుల్ ఆర్ రన్ టైం కూడా లాక్ చేసింది. 3.06 నిమిషాల రన్ టైం లాక్ చేసారు. నిడివి ఎంత పెద్దగా ఉన్నా చరణ్ - ఎన్టీఆర్ స్క్రీన్ పైన కనిపిస్తుంటే.. టైం ఎవరు లెక్క చెయ్యరు. హీరోల విన్యాసాలు చూస్తూ మైమరచిపోతారు. మూడు గంటల పాటు ట్రిపుల్ ఆర్ ట్రీట్ ఎంజాయ్ చెయ్యడమే తరువాయి. అల్లూరి, కొమరం భీం విశ్వరూపాలని చూడడానికి మరొక్క ఏడు రోజులు మాత్రమే టైం.. గెట్ రెడీ ఫాన్స్.. సెలెబ్రేషన్స్ కి రెడీ అయిపోండి.