Advertisementt

బిగ్ బాస్ ఓటిటి: ఈ వారం డేంజర్ జోన్ లో..

Fri 18th Mar 2022 11:19 AM
bigg boss,bigg boss ott,tejaswi,sravanthi,danger zone  బిగ్ బాస్ ఓటిటి: ఈ వారం డేంజర్ జోన్ లో..
Bigg Boss OTT: 2 contestants in danger zone బిగ్ బాస్ ఓటిటి: ఈ వారం డేంజర్ జోన్ లో..
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదలై మూడు వారాలు పూర్తి కావొస్తుంది. రెండు వారాల్లో ముమైత్ ఖాన్, శ్రీ రాపాక ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి ఇంటికి వెళ్లిపోయారు. ఇక కెప్టెన్సీ టాస్క్ లో అఖిల్, నటరాజ్ లు ఫేక్ అంటూ సీక్రెట్ టాస్క్ లో యాంకర్ శివ ఓట్ చెయ్యడంతో అఖిల్ కి కోపం వచ్చింది. టాస్క్ పూర్తయ్యాక శివ సారి చెప్పినా నేను యాక్సెప్ట్ చెయ్యను అన్నాడు. అరియనా కూడా ఫీలైంది. ఇక అనిల్ కెప్టెన్సీని బిగ్ బాస్ అర్ధాంతరంగా లాగేసుకున్నాడు. అతను కెప్టెన్సీలో సరిగా పని చెయ్యలేదు అంటూ బిగ్ బాస్ అనిల్ కి షాకిచ్చాడు. అయితే ఈ వారం నామినేషన్స్ లో గొడవలు పడి మరీ చాలామంది హౌస్ మేట్స్ ని నామినేట్ చేసారు. 

చాలెంజర్స్, వారియర్స్ టీమ్ నుండి బిందు మాధవి, స్రవంతి , మిశ్రా శర్మ, మహేశ్ విట్టా, యాంకర్ శివ, హమీదా , ఆరియానా , నటరాజ్ మాస్టర్, అఖిల్, అజయ్, ఆర్జే చైతూ, తేజస్వీలు నామినేట్ అయిన వారిలో ఉన్నారు. అయితే వారిలో బిందు మాధవి మొదటి రోజు నుండే ఓటింగ్ లో టాప్ లో ఉంది. తర్వాత అఖిల్ సార్థక్ ఉన్నాడు. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఓటింగ్ లో అఖిల్ నెంబర్ వన్ కి రాగా.. బిందు మాధవి సెకండ్ ప్లేస్ కి వెళ్ళిపోయింది. గత ఎపిసోడ్‌లో అఖిల్‌కు ఫేక్ అనే ట్యాగ్ ఇవ్వడంతో అతనికి సింపతీ ఓట్స్ పడుతున్నాయని, తర్వాత ఆర్జే చైతూను అఖిల్ కెప్టెన్‌గా గెలిపించడం వంటి వాటితో ఓటింగ్ బాగా పెరిగిపోయిందని తెలుస్తోంది. ఇక మూడో స్థానంలో యాంకర్ శివ, నాలుగో స్థానంలో అరియనా ఉన్నట్టుగా తెలుస్తుంది. నటరాజ్, మహేష్ తర్వాత తేజస్వి, స్రవంతి ఓటింగ్ లో చివరి స్థానాల్లో ఉన్నారని, నిన్నమొన్నటివరకు ఎక్కువ ఓట్స్ తెచ్చుకున్న తేజస్వి.. చివరి రోజుల్లో లాస్ట్ ప్లేస్ కి పడిపోయింది అంటున్నారు. సో ఈ వారం ఎలిమినేషన్ రసవత్తరంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది.  

Bigg Boss OTT: 2 contestants in danger zone:

Bigg Boss OTT Telugu: Tejaswi, Sravanthi in danger zone

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ