Advertisementt

గాడ్ ఫాదర్ సర్ ప్రైజ్ సీక్రెట్ రివీల్

Fri 18th Mar 2022 07:44 PM
megastar chiru,mohan raja,gaddar chiranjeevi godfather movie,god father movie  గాడ్ ఫాదర్ సర్ ప్రైజ్ సీక్రెట్ రివీల్
Gaddar in GodFather గాడ్ ఫాదర్ సర్ ప్రైజ్ సీక్రెట్ రివీల్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి - మోహన్ రాజా కాంబోలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ మూవీ లో బోలెడన్ని సర్ ప్రైజ్ లు దాగున్నాయి. ఈ సినిమా లూసిఫర్ కి రీమేక్ అయినా.. ఆ లూసిఫర్ ని తెలుగు నేటివిటీకి, ఆడియన్స్ కి నచ్చేలా చేస్తున్నారు. ఈ సినిమాలో నటిస్తున్న నటులతోనే సంచనాలు సృష్టిస్తున్నారు. నయనతార ని సిస్టర్ కేరెక్టర్ కి తీసుకురావడం, సల్మాన్ ఖాన్ నే గాడ్ ఫాదర్ కి బాడీ గార్డ్ ని చెయ్యడం వంటి విషయాలు అన్ని మెగా ఫాన్స్ కి సర్ ప్రైజ్ లే కదా. ఇంకా ఇంకా గాడ్ ఫాదర్ నుండి సర్ ప్రైజ్ ట్రీట్స్ అందుతూనే ఉన్నాయి ఫాన్స్ కి.

అది మెగాస్టార్ గాడ్ ఫాదర్ మూవీలో ప్రజా గాయకుడు గద్దర్ నటిస్తున్న విషయాన్ని స్వయానా ఆయనే రివీల్ చేసారు. ఇంకా గాడ్ ఫాదర్ లో తనేం కేరెక్టర్ చేసారో కూడా రివీల్ చేసారు ఆయన. కథ రీత్యా మెగాస్టార్ చిరు జైలు కి వెళ్లే సీన్ ఒకటి ఉంటుంది సినిమాలో. ఆ జైల్లో చిరు కి గద్దర్ పై కొన్ని సీన్స్ ఉంటాయట. అంటే చిరు తండ్రికి స్నేహితుడిగా గద్దర్ కనిపించబోతున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తయిందని చెప్పిన గద్దర్.. తాను నటించింది కొన్ని సీన్లే అయినా మంచి పారితోషికం కూడా ఇచ్చారని చెప్పారు. నిజ జీవిత పాత్రలో ఒకరకంగా తాను నిజ జీవిత పాత్రలో నటించానని విప్లవ చైతన్య గీతాల కళాకారుడుగానే ఈ సినిమాలో కనిపించబోతున్నట్టుగా గద్దర్ చెప్పారు.

Gaddar in GodFather:

Gaddar confirms his role in Chiranjeevi Godfather Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ