ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫాన్స్ మొత్తం బెంగుళూరు దగ్గరలో జరుగుతున్న ట్రిపుల్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హడావిడి కాదు.. రచ్చ రచ్చ చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఈ రోజు ఉదయం నుండే బెంగుళూర్ కి వెళ్ళిపోయి అక్కడ నుండి రోడ్ మార్గం చిక్కబల్లాపూర్ కి చేరుకున్నారు ఫాన్స్. ఇండియాస్ లోనే బిగ్గెస్ట్ ఈవెంట్ గా ట్రిపుల్ ఆర్ ఈవెంట్ ఉండబోతుంది. అందుకే ఫాన్స్ ఎంత దూరమైన ఆగేదెలే అంటూ కదం తొక్కారు. ఆ ఈవెంట్ ప్రాంగణంలో ఎన్టీఆర్, చరణ్ ఫాన్స్ జై ఎన్టీఆర్, జై చరణ్ అంటూ మోత మోగించేస్తున్నారు.
రామ్ చరణ్ - ఎన్టీఆర్, రాజమౌళి ఇంకా ఈ చిత్రంలో నటించిన నటులు, టెక్నీకల్ టీం అంతా ఈ ఈవెంట్ కి హాజరవుతున్నారు. స్టేజ్ పై ట్రిపుల్ టీం సంగతి ఎలా ఉన్న బారికేడ్ల వెనకాల ఉన్న ఫాన్స్ మాత్రం ఆగేలా కనిపించడం లేదు. ఇంతకు ముందు చెన్నై, బెంగుళూరు, కొచ్చి, ముంబై లలో చరణ్, ఎన్టీఆర్ ఫాన్స్ హంగామా, రచ్చ చూసాం. కానీ ఇప్పుడు అన్ని భాషల ఫాన్స్ ఒకేచోట అన్నట్టుగా ట్రిపుల్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రాంగణం అంతా ఆ ఇద్దరి హీరోల ఫాన్స్ రణగొణ ధ్వనిలా మారబోతుంది. ఫాన్స్ సందడే సందడి.!