రామ్ చరణ్ - ఎన్టీఆర్ ఒకే స్క్రీన్ పై సందడి చెయ్యడానికి కేవలం మరో ఐదు రోజులు మాత్రమే టైం ఉంది. ఈ లోపు ట్రిపుల్ ఆర్ ప్రెస్ మీట్స్, ఇంటర్వూస్ లో ఎన్టీఆర్ - చరణ్ కలిసి ఎంతగా ఎంజాయ్ చేస్తూ ఫాన్స్ కి కిక్ ఇస్తున్నారో మాటల్లో వర్ణించలేనిది. అయినా ఫాన్స్ లో మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనే ఈగో మాత్రం పోవడం లేదు. ఇప్పుడు కూడా ట్రిపుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే చిక్కబళ్లాపూర్ లోను ఎన్టీఆర్ ఫాన్స్, రామ్ చరణ్ ఫాన్స్ రచ్చ ఎలా ఉంది అంటే.. జై టిడిపి, జై ఎన్టీఆర్ అంటూ టిడిపి జెండాలతో ర్యాలీ నిర్వహిస్తూ రోడ్లపై రచ్చ చేస్తే.. రామ్ చరణ్ ఫాన్స్ ఈవెంట్ జరిగే చోట రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు జెండాలతో హడావిడి చెయ్యడమే కాదు.. చరణ్ ఫాన్స్ కూడా జై చరణ్ అంటూ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఆ ఈవెంట్ జరిగే ప్రాంగణంలో ఓ వైపు ఎన్టీఆర్ ఫాన్స్, మరోవైపు చరణ్ ఫాన్స్ ప్లకార్డులతో రచ్చ చేస్తున్నారు. తెలుగు దేశం జెండాలు, చరణ్ అల్లూరి జెండాలతో అక్కడ ఇరువైపులా కలర్ ఫుల్ జెండాలు కనిపిస్తుంటే స్టేజ్ పై ఓ వైపు ఫైర్, మరోవైపు వాటర్ కలర్స్ తో కలర్ ఫుల్ గా ఉంది. జై ఎన్టీఆర్, జై చరణ్ అంటూ ఒకరి మీద ఒకరు పోటీగా అరవడమే కాదు.. రోడ్లపై నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా ర్యాలీలు చేస్తూ తమ స్టార్స్ పై ప్రేమని చూపిస్తున్నారు. ఈవెంట్స్ కే అలా ఉంటే.. సినిమా చూసేటప్పుడు థియేటర్స్ మొత్తం జై ఎన్టీఆర్, జై చరణ్ నినాదాలతో మోగిపోతాయనిపిస్తుంది. థియేటర్స్ దగ్గర ఎన్టీఆర్, చరణ్ భారీ కటౌట్స్ తోనూ పోటీ పడేటట్లు కనిపిస్తుంది ఈ ఫాన్స్ వ్యవహారం.ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఎన్టీఆర్ ఫాన్స్, చరణ్ ఫాన్స్ జెండాల వీడియోస్ తోనే నిండిపోయింది.