Advertisementt

ఊర మాస్ అవతార్ లో నాని

Sun 20th Mar 2022 12:33 PM
dasara,nani,keerthy suresh,srikanth odela,dasara pan india movie  ఊర మాస్ అవతార్ లో నాని
Dasara spark creates a sensation ఊర మాస్ అవతార్ లో నాని
Advertisement
Ads by CJ

గత ఏడాది టక్ జగదీశ్ లో క్లాస్ గాను, శ్యామ్ సింగ రాయ్ లో రెట్రో లుక్ లో ఆకట్టుకున్న నాని.. అంటే సుందరానికి అంటూ బ్రాహ్మణుడిగా గా అమాయాకపు కేరెక్టర్ లో కనిపించబోతున్నాడు. అంటే సుందరానికి సినిమా జూన్ 10న రిలీజ్ అవుతుంది. ఈలోపులోనే నాని మరో సినిమాని పాన్ ఇండియా లెవల్లో మొదలు పెట్టేసాడు. అది దసరా.. డెబ్యూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తి సురేష్ తో రొమాన్స్ చేస్తున్నాడు. ఈమధ్యనే పూజా కార్యక్రమాలతో మొదలైన దసరా చిత్రం తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతుంది.

తెలంగాణాలో సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో దసరా మూవీ ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా దసరా నుండి నాని లుక్, అలాగే ఓ వీడియో ని రివీల్ చేసారు. లుంగీతో మాసీవ్‌గా ఉన్న నాని లుక్‌ టెర్రిఫిక్‌గా ఉంది. బొగ్గు గనుల మధ్యన నాని లుంగీ కట్టుకుని ఊర మాస్ అవతార్ లో నడుచుకుంటూ వెళుతూ బొగ్గు మంటలో చెయ్యి పెట్టి బీడీ కాల్చిన సన్నివేశం, వెనకాల కార్మికులు బుల్డోజర్, టిప్పర్ మధ్యన నాని అన్నిటిని ఓ టీజర్ లో రివీల్ చేసారు. నాని దసరా మూవీ ని పాన్ ఇండియా స్టయిల్లో తెరకెక్కిస్తున్నారు.. అయితే నాని లుక్ చూడగానే అందరికి రీసెంట్ గానే పాన్ ఇండియా లో భారీ హిట్ కొట్టిన బన్నీ పుష్ప లుక్ గుర్తొస్తుంది.. నాని లుక్ అచ్చం అల్లు అర్జున్ పుష్ప రాజ్ లుక్ చూసినట్టుగా ఉంది అని కామెంట్స్ చెయ్యడం గమనార్హం. ఇక తెలంగాణ యాస్ లో మాట్లాడేందుకు నాని ప్రత్యేకంగా ఓ ట్యూషన్ మాస్టర్ ని పెట్టుకున్నాడని తెలుస్తుంది. 

Dasara spark creates a sensation:

Dasara: Nani ignites a mass spark

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ