రాజమౌళి నుండి రాబోతున్న ట్రిపుల్ ఆర్ ని ప్రమోట్ చెయ్యడానికి బాలీవుడ్ కదిలింది. గత డిసెంబర్ ప్రమోషన్స్ లో ముంబై లో జరిగిన ట్రిపుల్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సల్మాన్ ఖాన్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్ లతో కలిసి స్టేజ్ పై సందడి చెయ్యడమే కాదు.. ట్రిపుల్ ఆర్ కోసం వెయిటింగ్ అంటూ ఆ సినిమాపై హైప్ క్రియేట్ చేసారు. అప్పుడు సల్మాన్ ఖాన్ ట్రిపుల్ ఆర్ ని నార్త్ లో ప్రమోట్ చేస్తే.. నిన్న అమీర్ ఖాన్ ఢిల్లీ ట్రిపుల్ ఆర్ ఈవెంట్ లో గెస్ట్ గా హాజరై నార్త్ ప్రేక్షకుల్లో ఆ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశారు. రాజమౌళి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ట్రిపుల్ ఆర్ ని నార్త్ లో ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు.
అమీర్ ఖాన్ అయితే స్టేజ్ పై ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో నాటు నాటు సాంగ్ కి స్టెప్స్ కూడా వేసి ట్రిపుల్ ఆర్ ని ప్రమోట్ చెయ్యడం అందరిని ఆకర్షించింది. అమీర్ ఖాన్ కి చరణ్ నాటు నాటు స్టెప్స్ నేర్పించగా అమీర్ ఖాన్ చాలా ఈజీగా ఆ స్టెప్స్ వేసి చూపించారు. మధ్యలో ఎన్టీఆర్, అలియా భట్ కూడా కాలు కదిపారు. మరి ఇద్దరి స్టార్ హీరోలు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడమే మాములు విషయం కాదు అనుకుంటే.. ఇప్పుడు బాలీవుడ్ హీరోలు సైతం ఆ సినిమాని ప్రమోట్ చెయ్యడం ట్రిపుల్ పై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తుంది.