బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదలై మూడు వారాలు పూర్తయ్యింది. నాలుగో వారంలోకి అడుగుపెట్టారు హౌస్ మేట్స్. ఇప్పటివరకు ఎవరూ అనుకోని, ఊహించని ఎలిమినేషన్స్, నామినేషన్స్ జరుగుతున్నాయి. అంతేకాకుండా కెప్టెన్ అయిన వ్యక్తి ఎలిమినేట్ అవడం బిగ్ బాస్ చరిత్రలోనే మొదటిసారి కావడం, అలాగే కెప్టెన్ అయిన వ్యక్తి కెప్టెన్సీలో విఫలమవడంతో ఆయన నుండి కెప్టెన్సీ ని లాక్కోవడం వంటి వింత పరిణామాలు కూడా బిగ్ బాస్ నాన్ స్టాప్ లో చోటు చేసుకున్నాయి. ఇక ఈ వారం టాప్ 5 అనుకున్న ఆర్జే చైతు ఎలిమినేట్ అవడం హౌస్ మేట్స్ ని, బయట ఉన్న ఆయన అభిమానులని షాక్ కి గురి చేసింది. అదలా ఉంటే ఈ వారం కూడా గట్టి కంటెస్టెంట్స్ నామినేషన్స్ లోకి వెళ్లారు.
బిగ్ బాస్ టాస్క్ ప్రకారం ఓ హార్న్ ని ఎవరు ముందు టచ్ చేస్తే వారు ఇంటిసభ్యులని ఇద్దరిని నామినేషన్స్ లో నించోబెట్టి హౌస్ మేట్స్ ఓటింగ్ ప్రకారం ఒకరు నామినేట్ అయ్యేలా చేసారు. అందులో నటరాజ్ మాస్టర్, మహేష్ లు మూడు మూడుసార్లు హార్న్ టచ్ చేసి ఆరుగురిని నామినేషన్స్ లోకి పంపారు. అందరూ తమని తాము కాపాడుకోవడానికి వాదించారు. అందులో బాడీ షేమింగ్ అంటూ సరయూకి, అరియనాకి మధ్యలో పెద్ద గొడవే జరిగింది. ఇక మిగతా నామినేషన్స్ కూల్ గానే జరిగాయి.
అందులో యాంకర్ శివ వరసగా ఐదారుసార్లు నామినేషన్స్ లోకి వెల్లబోయి హౌస్ మేట్స్ సహకారంతో తప్పించుకున్నా చివరికి అతనూ నామినేట్ అయ్యాడు. ఈ వారం నామినేట్ అయిన వారిలో ముందుగా టైటిల్ ఫెవరెట్ బిందు మాధవి, మిత్ర శర్మ, ఆరియానా , సరయు, యాంకర్ శివ, అజయ్, అనిల్ రాథోడ్ లు ఉన్నారు. మరి ఇందులో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది ఆసక్తికరంగా మారింది.