మెహ్రీన్ కౌర్ గత ఏడాది మీడియాలో సెన్సేషన్ అయిన హీరోయిన్. ఎందుకంటే తన బాయ్ ఫ్రెండ్ తో ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్ళికి సిద్దమైన తర్వాత అది బ్రేక్ చేసుకుని పెళ్లి ని ఆపేసింది. పెళ్లి కన్నా కెరీర్ ముఖ్యమని రియలైజ్ అయ్యి పెళ్లిని ఆపెసుకున్న మెహ్రీన్ ఆ తర్వాత తన బబ్లీనెస్ మొత్తాన్ని వదిలేసి బరువు తగ్గి స్లిమ్ గా తయారయ్యింది. ఆ స్లిమ్ నెస్ తో పాటుగా మెహ్రీన్ కౌర్ గ్లామర్ డోస్ పెంచేసింది. కానీ మొహం లో ఆ గ్లో తగ్గిపోయింది. ప్రెజెంట్ ఎఫ్ 3 తో పాటుగా ఒకటి రెండు ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్న మెహ్రీన్ పర్ ఇండస్ట్రీ, హీరోయిన్స్, హీరోలు, నటులపై ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
ఆర్టిస్ట్ ల లైఫ్ లు చాలా విచిత్రంగా ఉంటాయని, లైఫ్ లో ఎలాంటి గ్యారెంటీ లేని జీవితాలు అని, అలాంటి గ్యారెంటీ లేని లైఫ్ కావాలని, ఇష్టం గానే స్వీకరిస్తామని, దానిలో భాగంగా తమ బాడీ ని సినిమా కోసం అనుకూలంగా మర్చుంటామని, ఎన్నో ఎత్తుపల్లాలు చూస్తామని, రాత్రికి రాత్రే సక్సెస్ అవుతామని, మరికొన్నిసార్లు ప్లాప్ లు చవిచూస్తామని, హెల్త్ కి మంచిది కాదని తెలిసినా అన్నిటికీ అలవాటు పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా ఆకలి, నిద్ర, బాధ అన్నింటికీ ఓర్చుకుని పనిచేస్తామంది. ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి దూరమై రోజులు, వారాల పాటు ఉంటామని, కొన్నికొన్ని సార్లు అధ:పాతాళానికీ కూరుకుపోతామంటూ చెబుతూ మెహ్రీన్ ఎందుకో బాగా ఎమోషనల్ అయ్యింది.