Advertisementt

డివివి దానయ్య కొడుకు అధీరగా

Tue 22nd Mar 2022 05:50 PM
prashanth varma,dvv danayya son,rrr producer,kalyan,adheera title,adheera movie  డివివి దానయ్య కొడుకు అధీరగా
DVV.Danayya son to make his debut డివివి దానయ్య కొడుకు అధీరగా
Advertisement
Ads by CJ

దానయ్య అంటే ఇప్పుడు ఈయన పేరు తెలియని వారే లేరు. ట్రిపుల్ ఆర్ ప్రొడ్యూసర్ గా దానయ్య అంతగా పాపులర్ అయ్యారు. రాజమౌళి అడిగింది లేదనకుండా ఇచ్చి, సినిమా వాయిదాల మీద వాయిదా పడినా, హీరోలకి, దర్శకుడి కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చి ప్రమోషన్స్ చేయించుకుని బెస్ట్ ప్రొడ్యూసర్ అనిపించుకుంటున్నారు. ట్రిపుల్ ఆర్ హిట్ తన ఖాతాలో ఖచ్చితంగా పడుతుంది అనే ధీమాలో ఉన్నారు ఆయన. ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ కొన్నిటిలో ఆయన పాల్గొని ఫన్నీగా స్పీచ్ ఇచ్చారు. ఇప్పుడు దానయ్య కొడుకు హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రొడ్యూసర్స్ కొడుకులు, దర్శకుల కొడుకులు హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలామందే సక్సెస్ అవుతున్నారు. 

ఇప్పుడు ఆ లిస్ట్ లోకి దానయ్య కొడుకు కళ్యాణ్ కూడా చేరాడు. కళ్యాణ్ డెబ్యూ మూవీకి ప్రశాంత్ వర్మ దర్శకతం వహించనున్నారు. అ, కల్కి, జాంబీ రెడ్డి రీసెంట్ గా హనుమాన్ మూవీ తో పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే కళ్యాణ్ హీరోగా సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇస్తున్నాడట. అయితే ప్రశాంత్ వర్మ కళ్యాణ్ డెబ్యూ మూవీకి అధీర అనే పవర్ ఫుల్ టైటిల్ అనుకుంటున్నాడట. దానయ్య కి సింగిల్ సిట్టింగ్ లో కథ చెప్పి ఒప్పించి.. స్క్రిప్ట్ లాక్ చేసాడని, ఆ సినిమాకి అధీర అనే పవర్ ఫుల్ టైటిల్ అనుకుంటున్నట్లుగా దానయ్య కి చెప్పాడని, దానయ్య కూడా నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్సమెంట్ రాబోతుంది అంటున్నారు.  

DVV.Danayya son to make his debut :

Prashanth Varma To Introduce Danayya Son

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ