Advertisementt

ట్రిపుల్ ఆర్ ఫాన్స్ కి వార్నింగ్

Wed 23rd Mar 2022 02:16 PM
rrr,rrr fans,rajamouli,ntr,ram charan,charan fans,ntr fans  ట్రిపుల్ ఆర్ ఫాన్స్ కి వార్నింగ్
Warning to RRR Fans ట్రిపుల్ ఆర్ ఫాన్స్ కి వార్నింగ్
Advertisement
Ads by CJ

ట్రిపుల్ ఆర్ రావడానికి సమయం ఆసన్నమైంది. ట్రిపుల్ ఆర్ కోసం కొన్ని నెలలు నుండి ఎన్టీఆర్, చరణ్ ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయ్యే థియేటర్స్ దగ్గర బ్యానెర్లు, కటౌట్స్ తో హడావిడి చేస్తున్నారు. హీరోలకి కటౌట్స్ కట్టడం చూస్తుంటాం. కానీ ట్రిపుల్ ఆర్ దర్శకుడు రాజమౌళికి కటౌట్ పెట్టడం మాత్రం నిజంగా మాములు విషయం కాదు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో రాజమౌళికి అదిరిపోయే కటౌట్ పెట్టారు ఆయన ఫాన్స్. అయితే ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫాన్స్ కి థియేటర్స్ ఓనర్స్ వార్నింగ్ ఇస్తున్నారు.

ఎందుకంటే ఫాన్స్ హీరోల ఇంట్రడ్యూసింగ్ సీన్స్ చూడగానే రెచ్చిపోయి పాలాభిషేకాలు, అలాగే పేపర్స్ చింపి విసరడాలు చేస్తారు. కొంతమంది తెర దగ్గరకి వెళ్ళిపోయి హంగామా చేస్తారు. ఈమధ్యనే రాధే శ్యామ్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాలో ప్రభాస్ ఎంట్రీ సీన్ చూడగానే ఆయన ఫాన్స్ తెరపైనే పాలాభిషేకం చేసి క‌ల‌క‌లం రేపారు.  తర్వాత ఆ తెర పై మరకలు పడి అది పాడవడంతో దానికి మళ్ళీ 15 లక్షలు ఖర్చు పెట్టి రీ మోడలింగ్ చేయించాల్సి వచ్చింది.  అందుకే ఈసారి ట్రిపుల్ ఆర్ ఫాన్స్ అలాటివి చెయ్యకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా ఫాన్స్ కి ముందే వార్నింగ్ ఇస్తున్నారు.

Warning to RRR Fans:

RRR releasing on March 25th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ