ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన కృతి శెట్టి ఓవర్ నైట్ స్టార్ అవడమే కాదు.. వరస సక్సెస్ తో యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తుంది. ఒక్క సినిమాతోనే కృతి శెట్టి రేంజ్ మారిపోయింది. అలాగే మూడు వరస సక్సెస్ లు ఉండడంతో ఆమె పారితోషకం అమాంతం పెరిగింది. కానీ మొదటి సినిమాతోనే ప్లాప్ అందుకున్నా ఆమె కోటి పారితోషకం డిమాండ్ చేసే స్థాయికి వెళ్ళింది. ఆమె ఎవరో కాదు పెళ్లి సందడి హీరోయిన్ శ్రీ లీల. శ్రీ లీల కి పెళ్లి సందడి డిజాస్టర్ ఇచ్చినా.. ఆమెకి మంచి కెరీర్ ఇచ్చింది.
ఆ సినిమాలో శ్రీ లీల లుక్స్ నచ్చిన యంగ్ హీరోలు ఆమెకి తమ సినిమాల్లో ఆఫర్స్ ఇచ్చారు. ఇప్పడు శ్రీ లీల రవి తేజ ధమాకా లోను, నవీన్ పోలిశెట్టి తో మరో సినిమాకి సైన్ చేసింది. అంతేకాకుండా నితిన్ తో జూనియర్ లోను, మహేష్ తో SSMB28 లోను నటించబోతుంది అనే న్యూస్ ఉంది. వరస ఆఫర్స్ తో మోస్ట్ వాంటెడ్ గా మారిన శ్రీ లీల దానికి తగ్గట్టుగా కోటి డిమాండ్ చేసేస్తోందట. మరి ఆమెకి వచ్చిన ఆఫర్స్ చూసిన మేకర్స్ కూడా కోటి ఇవ్వడానికి రెడీ అవుతున్నారనే న్యూస్ వినిపిస్తుంది.