బిగ్ బాస్ ఓటిటి నాలుగో వారం పూర్తి చేసుకోబోతుంది. కెప్టెన్సీ టాస్క్, లగ్జరీ బడ్జెట్ టాస్క్, నామిషన్స్ హీట్ తో ప్రతి వారం బిగ్ బాస్ ఇంటి సభ్యుల మధ్యన గొడవలు కొట్లాటలు సర్వసాధారణం అయ్యాయి. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో తన స్టార్స్ ని పోగొట్టుకున్న నటరాజ్ మాస్టర్ రెండు చెంపలు వాయించేసుకుని ఏడ్చేశాడు. అంతగా నటరాజ్ మాస్టర్ ఎమోషనల్ అయ్యాడు. ఇక ఈ వారం నామినేషన్స్ లో క్రేజ్ ఉన్న కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో బిందు మాధవి, మిత్ర శర్మ, యాంకర్ శివ, అరియనా, అనిల్, సరయు, అజయ్ లు ఈ వారం నామినేట్ అయ్యారు.
అందులో టైటిల్ ఫెవరెట్ గా ఉన్న బిందు మాధవి మొదటి నుండి ఓటింగ్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉండగా.. తన గేమ్, యాటిట్యూడ్ తో యాంకర్ శివ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇక తర్వాత స్థానాల్లో అజయ్ ఉండగా, ఆ తర్వాత అరియనా, తర్వాత సరయు వరస స్థానాల్లో కొనసాగుతున్నారు. చివరి రెండు స్థానాల్లో అనిల్, మిత్రా శర్మ డేంజర్ జోన్ లోకి వచ్చినట్టుగా ఓటింగ్స్ చెబుతున్నాయి. ఈ వారం ఎక్కువగా అనిల్ కానీ, మిత్ర శర్మ కానీ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ చివరి రోజుల్లో ఓటింగ్ తారుమారు అయ్యి టాప్ లో ఉన్నవాళ్లు ఎలిమినేట్ అయినా షాకవ్వాల్సిన పని లేదు అంటున్నాయి గత ఎలిమినేషన్స్.