ప్రభాస్ లేటెస్ట్ ఫిలిం రాధే శ్యామ్ ప్రభాస్ కి భారీ షాక్ ఇచ్చింది. విపరీతమైన బడ్జెట్ పెట్టి అనుభవం లేని దర్శకుడితో పాన్ ఇండియా లెవల్ మూవీని నిర్మించిన యువీ క్రియయేషన్స్ వారు రాధే శ్యామ్ తో మునిగిపోయారు. రాధే శ్యామ్ మూవీలో షిప్ మునిగినట్టుగా ఉంది ఆ సినిమాని కొన్న బయ్యర్ల పరిస్థితి ఉంది. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయిన రాధే శ్యామ్ మూవీ అన్ని భాషల్లోనూ డివైడ్ టాక్ తెచ్చుకుంది. ప్రభాస్ కి విపరీతమైన క్రేజ్ ఉన్న హిందీ లోను రాధే శ్యామ్ డిజాస్టర్ లిస్ట్ లోకి వెళ్ళింది. దానితో ప్రభాస్ కూడా షాకయ్యారట.
ఇంతకు ముందు సాహో తో నష్టపోయిన యువీ క్రియేషన్స్.. ఇప్పుడు రాధే శ్యామ్ తో భారీ లాస్ అయ్యారు. యువీ క్రియేషన్స్ అంటే ప్రభాస్ సొంత సంస్థలాంటిది. అందుకే రాధే శ్యామ్ సినిమా ప్లాప్ కి తాను ఓ కారణమని ప్రభాస్ తన రెమ్యునరేషన్ ని కొంత వెనక్కి ఇచ్చేసి నష్టాలను కవర్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. రాధే శ్యామ్ రిలీజ్ అయ్యాక వెకేషన్స్ కి వెళ్లొచ్చిన ప్రభాస్ ఇప్పుడు రాధే శ్యామ్ నష్టాలను పూడ్చే పనిలో ఉన్నారని అంటున్నారు. తన పారితోషకంలో చాలావరకు రాధే శ్యామ్ నష్టాలకు కట్టినట్టుగా తెలుస్తుంది.