కోలీవుడ్ హీరో ఆదిపిని శెట్టి - హీరోయిన్ నిక్కీ గల్రాని కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని, ఓ రెండు సినిమాలు కలిసి చేసిన ఈ జంట ఆ సినిమాల షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడింది అని, అలాగే కొంతకాలంగా నిక్కీ గల్రాని ఆదిపినిశెట్టి ఇంటి ఫంక్షన్స్ లో హడావిడి చేస్తుంది అంటూ ప్రచారం జరుతుంది. ఇలాంటి సమయంలోనే ఆది కి నిక్కీ కి నిశ్చితార్ధం జరిగిపోయింది అంటూ కోలీవుడ్ మీడియా కోడై కూసింది. ఇంతజరిగినా ఆది ఫ్యామిలీ కానీ, నిక్కీ గల్రాని కానీ పెదవి విప్పలేదు.
ఎట్టకేలకు ఆ విషయంపై స్పందించారు ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని. జీవితంలో మనల్ని అర్ధం చేసుకునే వారు దొరకడం మా అదృష్టం. మేము కొన్ని సంవత్సరాల క్రితం ఒకరినొకరు కనుగొన్నాము, ఇప్పుడు అధికారికంగా మా ఎంగేజ్మెంట్ జరిగింది. నిజంగా ఈ రోజు మాకు చాలా స్పెషల్. మేమిద్దరం కలిసి చేసే ఈ ప్రయాణంలో మీ ప్రేమ, దీవెనలు కోరుతూ మా ఫామిలీస్ సమక్షంలో సింపుల్ గా మా నిశ్చితార్ధం జరిగింది.. అంటూ ఆది పినిశెట్టి - నిక్కీ గల్రాని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక వీరిద్దరూ మలుపు, మరకతమని చిత్రాల్లో కలిసి నటించిన సమయంలోనే ప్రేమలో పడినట్లుగా తెలుస్తుంది.