ఆర్ ఆర్ ఆర్ అంటూ నాలుగేళ్ళ కష్టానికి తగిన ప్రతి ఫలాన్ని జక్కన్న తన హీరోలైన ఎన్టీఆర్ కి, రామ్ చరణ్ కి కట్టబెట్టారు. కొమరం భీం గా ఎన్టీఆర్, రామరాజుగా రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పెరఫార్మెన్స్ ఇచ్చారు. ట్రిపుల్ ఆర్ చూసిన ఫాన్స్ సంబరాలకు పట్టపగ్గాలు లేవు. అయితే సినిమాలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ పదే పదే తలపడుతూ కొట్టుకుంటారు. ఇంటర్వెల్ బ్యాంగ్ లోను ఎన్టీఆర్ - రామ్ చరణ్ కి మధ్యన ఫైట్ ఉంటుంది. రామ్ చరణ్ - ఎన్టీఆర్ ఫైర్ అండ్ వాటర్ ఫైట్ తో అదరగొట్టేసాడు. ఆ తర్వాత రామ్ చరణ్ ఎన్టీఆర్ ని శిక్షించే క్రమంలో ఎన్టీఆర్ ని చావగొడతాడు. ఆ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ ని తల మీద కొడతాడు. అయితే అదంతా సినిమానే కానీ.. చిన్న పిల్లలకి అది నచ్చదు. రామ్ చరణ్ ని ఎన్టీఆర్ కొడుతుంటే ఓ బుడ్డోడు థియేటర్ లో తెగ ఏడ్చేశాడట.
మరి ఎన్టీఆర్ ని చరణ్ కొట్టినప్పుడు ఆయన పిల్లలైన అభయ్ రామ్, భార్గవ్ రామ్ లు ఎలా ఫీలై ఉంటారు. ఇంకా ఊహతెలియని పిల్లలు రామ్ చరణ్ ఎన్టీఆర్ ని కొడుతున్నప్పుడు డాడీ ని ఎవరో కొడుతున్నారంటూ థియేటర్ లో ఎంతగా ఫీలై ఉంటారు. మరోపక్క రామ్ చరణ్ ని ఎన్టీఆర్ కొట్టేటప్పుడు కొట్టు డాడీ గట్టిగా కొట్టు అంటూ క్లాప్స్ కొట్టినా ఆశ్చర్య పోవక్కర్లేదు, నిజంగా ఎన్టీఆర్ కొమరం భీం గా కొమరం భీముడా సాంగ్ లో ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కి, అలాగే అమాయకమైన నటనకు ఆయన ఫాన్స్ మాత్రమే కాదు.. సాధారణ ప్రేక్షకుడు బాగా బాగా ఇంప్రెస్స్ అయ్యారు.