Advertisementt

ట్రిపుల్ ఆర్ ని ఫాలో అవుతారా..

Mon 28th Mar 2022 10:49 AM
liger,rrr,liger promotions,vijay deverakonda,rajamouli,puri jagannadh  ట్రిపుల్ ఆర్ ని ఫాలో అవుతారా..
Will you follow RRR ట్రిపుల్ ఆర్ ని ఫాలో అవుతారా..
Advertisement
Ads by CJ

రాజమౌళి ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ విషయంలో ఓ స్టేజ్ సెట్ చేసారు. పాన్ ఇండియా మూవీస్ ప్రమోషన్స్ ఏ రేంజ్ లో చెయ్యాలో ఆయన అందరికి చూపించారు. డిసెంబర్ లోనే 99 శాతం ప్రమోషన్స్ పూర్తి చేసిన జక్కన్న.. మళ్ళీ మార్చి లో ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా తగ్గలేదు. హీరోలతో ఇండియా వైడ్ గా ఆయన చాలా కష్టపడ్డారు. అలాగే దుబాయ్ కూడా వెళ్లి అక్కడ నేషనల్ ఈవెంట్ చేసి వచ్చారు. బాహుబలి కన్నా ఎక్కువగా ట్రిపుల్ ఆర్ ని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లారు రాజమౌళి. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ సాహో, రాధే శ్యామ్ ప్రమోషన్స్ విషయంలో ఫెయిల్ అయ్యారు. పాన్ ఇండియా రేంజ్ లో సినిమా చేసి లోకల్ గా ప్రమోషన్స్ చేసారు.

అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం లైగర్ విషయంలో రాజమౌళిని ఫాలో అవుతాడేమో అనిపిస్తుంది. ఆగష్టు లో రిలీజ్ కాబోతున్న లైగర్ మూవీ ప్రమోషన్స్ ని పూరి తో కలిసి విజయ్ దేవరకొండ క్రేజీగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఫస్ట్ పాన్ ఇండియా మూవీతోనే విజయ్ దేవరకొండ క్రేజీగా గ్రాండ్ గా హిందీలోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. అందుకే బాలీవుడ్ పరిచయాలు, బాలీవుడ్ హీరోయిన్స్ తో ఫ్రెండ్ షిప్స్, బాలీవుడ్ పార్టీలు అంటూ విజయ్ పక్కా ప్లానింగ్ లో ఉన్నాడు. ఇక లైగర్ ప్రమోషన్స్ తోనూ విజయ్ దేవరకొండ హీటెక్కించాలని అది కూడా జులై నుండి స్టార్ట్ చెయ్యాలని చూస్తున్నారట.

Will you follow RRR:

Liger follows RRR

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ