Advertisementt

రాధే శ్యామ్ ఓటిటి రాక ఫిక్స్

Mon 28th Mar 2022 05:06 PM
radhe shyam,romantic storm,ott,prabhas,radhe shyam ott date fix  రాధే శ్యామ్ ఓటిటి రాక ఫిక్స్
Radhe Shyam OTT streaming finalized రాధే శ్యామ్ ఓటిటి రాక ఫిక్స్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన లవ్ స్టోరీ రాధే శ్యామ్. మార్చ్ 11న విడుదలైన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. దానితో ప్రభాస్ ఫాన్స్ బాగా డిస్పాయింట్ అయ్యారు. ఆ సినిమా తో నిర్మాతలు భారీగా లాస్ అయ్యారు. రాధే శ్యామ్ రిలీజ్ అయిన అన్ని భాషల్లో డిజాస్టర్ అవ్వడం ఫాన్స్ కి షాకిచ్చింది. మార్చ్ 11 న థియేటర్స్ లో రిలీజ్ అయిన రాధే శ్యామ్ కి ఇప్పుడు ఓటిటి రాక ఫిక్స్ అయ్యింది. థియేటర్స్ లో ఎప్పుడో ఫైనల్ రన్ ముగియడంతో మేకర్స్ ఈ సినిమాని ఓటిటి నుండి రిలీజ్ చేసెయ్యడానికి రెడీ అయ్యారు.  

అభిమానులకు మరో తీపి కబురు అంటూ రాధే శ్యామ్ యూనిట్.. ఎప్రిల్ 1న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మ్యాజికల్ లవ్ జర్నీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయాన్ని అధికారికంగా పోస్టర్ విడుదల చేసి ప్రకటించారు. అమెజాన్‌లో ఈ ప్రేమకథను చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని.. ఎప్రిల్ 1 నుంచి కచ్చితంగా అంతా రాధే శ్యామ్‌తో ప్రేమలో పడిపోతారని చెప్తున్నారు.

Radhe Shyam OTT streaming finalized:

Radhe Shyam romantic storm on OTT

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ