విజయ్ దేవరకొండ - పూరి జగన్నాధ్ లైగర్ సినిమా కోసం కలిసి ముంబై లోనే ఉంటున్నారు. అక్కడ ముంబై చుట్టుపక్కల ప్రాంతాల్లోనే లైగర్ షూటింగ్ చేసిన ఈ కాంబో.. కి ఛార్మి నిర్మాతగా తోడైంది. అలాగే బాలీవుడ్ కరణ్ జోహార్ సాయంతో విజయ్ దేవరకొండ అక్కడ హిందిలో మార్కెట్ పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక లైగర్ మూవీ విడుదలకు ముందే పూరి - విజయ్ కలిసి మరో ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకి తీసుకెళ్ళబోతున్నారు. అది కూడా మార్చి 29 అంటే రేపే. నెక్స్ట్ మిషన్ లాంచ్ అంటూ ప్రకటించిన కొద్ది సేపటికే విజయ్ దేవరకొండ తన పేరెంట్స్ అలాగే పూరి-ఛార్మి లతో ముంబై లో లంచ్ కోసం మీట్ అయ్యారు.
విజయ్ దేవరకొండ పూరి-ఛార్మి అలాగే విజయ్ తల్లితండ్రులు లంచ్ ముంబై లో లంచ్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంటే పూరి - విజయ్ ల నెక్స్ట్ మిషన్ జన గణ మన రేపు ముంబైలో స్టార్ట్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇది కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే చేస్తున్నారేమో.. అందుకే ముంబైలోనే ఈప్రాజెక్టు కి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని అంటున్నారు. అందుకే విజయ్ ఫ్యామిలి ముంబైలో దిగింది అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ లో విజయ్ దేవరకొండ సరసన జాన్వీ కపూర్ నటించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది.