Advertisementt

మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్: ఇంట్రెస్టింగ్ బడ్జెట్

Mon 28th Mar 2022 08:25 PM
mahesh,rajamouli,mahesh - rajamouli combo,ssmb29,rrr movie  మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్: ఇంట్రెస్టింగ్ బడ్జెట్
Mahesh-Rajamouli Project: Interesting budget మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్: ఇంట్రెస్టింగ్ బడ్జెట్
Advertisement
Ads by CJ

ట్రిపుల్ ఆర్ ని ఎంతో కష్ట పడి ఇష్టపడి తెరకెక్కించి అంతే కష్టపడి ప్రమోషన్స్ చేసి ఆడియన్స్ ముందుకు వచ్చి శెభాష్ అనిపించుకుంటున్న ఎస్ ఎస్ రాజమోళి.. ట్రిపుల్ ఆర్ సక్సెస్ అవడంతో ఆ సినిమాని హిట్ చేసిన ఆడియన్స్ కి, తనని విష్ చేసిన వారికి పేరు పేరునా కృతఙ్ఞతలు తెలిపి కూల్ అయ్యారు. ఆర్ ఆర్ ఆర్ సక్సెస్ తర్వాత రామ్ చరణ్ బర్త్ డే వేడుకల్లో రాజమౌళి ఫ్యామిలీ కూడా పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక సినిమా సక్సెస్ అవడంతో రాజమౌళి అండ్ ఫ్యామిలీ కొన్నాళ్ళు పాటు వెకేషన్స్ ని ఎంజాయ్ చెయ్యడానికి ఓ విదేశీ ట్రిప్ వెయ్యబోతుంది.

ఆ తర్వాత రాజమౌళి కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుని మహేష్ తో చెయ్యబోయే ప్రాజెక్ట్ పై కూర్చుంటారట. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేసి రాజమౌళి కి వినిపించడానికి వెయిటింగ్. అయితే ఈ సినిమా జేమ్స్ బాండ్ తరహాలో ఆఫ్రికా అడవుల్లో హాలీవుడ్ రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారట. ట్రిపుల్ ఆర్ మూవీకి 400 కోట్ల బడ్జెట్ కేటాయించిన రాజమౌళి దానికి డబుల్ అంటే అంతకు మించి అనేలా మహేష్ మూవీకి 800 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ స్టయిల్లో ఆ మూవీ ని తెరకెక్కిస్తారని తెలుస్తుంది. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ.. మహేష్ తో చెయ్యబోయే భారీ బడ్జెట్ మూవీ అని, టెక్నీకల్ గా హై స్టాండర్డ్స్ తో ఈ మూవీ ఉండబోతున్నట్లుగా మాత్రం తెలుస్తుంది. 

Mahesh-Rajamouli Project: Interesting budget:

Who will budge-Mahesh or Rajamouli?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ