బిగ్ బాస్ నాన్ స్టాప్ లోకి టైటిల్ ఫెవరెట్ గా దిగిన అఖిల్ ఇప్పుడు బిందు మాధవి చేతిలో ఓడిపోవడానికి రెడీ అయ్యాడనే టాక్ సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తుంది. బిందు మాధవి హౌస్ లోకి ఎంటరైనప్పటి నుండి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అటు నామినేషన్స్ లోను, ఇటు టాస్క్ ల్లోనూ గట్టి పోటీ ఇస్తుంది. కొంతమంది అయితే బిందు మాధవి గ్రూప్ గా చేసి అందరితో ఆడుకుంటుంది అంటూ ఓపెన్ గానే చెబుతున్నారు. ఇక అఖిల్ కి బిందు మాధవికి పడడం లేదు. యాంకర్ శివ తో బిందు మాధవి క్లోజ్ గా ఉంటుంది. అలా బిందు మాధవి తన బలాన్ని బలగాన్ని పెంచుకుంటుంది హౌస్ లో. వరస నామినేషన్స్ లోకి వచ్చినా ఓటింగ్స్ లో నెంబర్ వన్ ప్లేస్ లోనే కొనసాగుతుంది ఆమె.
గత రాత్రి బిందు మాధవి ఇండియా వైడ్ గా ట్రెండ్ అయ్యింది. ఆమె ఫాన్స్ ఆమెని సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. దానితో ఆమె క్రేజ్ మరింతగా పెరిగిపోతుంది. ఇక ఈ వారం నామినేషన్స్ సోమవారంతో ముగియలేదు. ఆ నామినేషన్స్ ప్రక్రియ మంగళవారం కూడా కొనసాగింది. సోమవారం నామినేట్ అయిన ఏడుగురు కంటెస్టెంట్స్ లో ముగ్గురిని స్వైప్ అంటే మార్చుకునే మరో టాస్క్ కూడా ఇచ్చాడు బిగ్ బాస్. అలా అషు రెడ్డి, అరియనా, బిందు మాధవి సేఫ్ అయినా.. చివరికి నటరాజ్ మాస్టర్ కి వచ్చిన అవకాశంతో బిందు మాధవిని టార్గెట్ చేసి నామినేట్ చేసాడు.
అలా ఈ వారం బిందు మాధవి, మిత్రా శర్మ, ఆరియానా, తేజస్వీ, యాంకర్ శివ, స్రవంతి, అనిల్ రాథోడ్‌లు నామినేట్ అయ్యారు. వరసగా అందరూ బిందు మాధవిని టార్గెట్ చెయ్యడంతో ఆమె కాస్త ఎమోషనల్ అవగా.. ఆమె అభిమానులు బిందు మాధవిని సపోర్ట్ చేస్తూ ఆమెకి మద్దతు తెలుపడంతో బిందు మాధవి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది.