Advertisementt

మంచు మనోజ్ కి షాకిచ్చిన ట్రాఫిక్ పోలీస్ లు

Wed 30th Mar 2022 12:31 PM
hyderabad,hyderabad police fine,manchu manoj,allu arjun,kalyan ram  మంచు మనోజ్ కి షాకిచ్చిన ట్రాఫిక్ పోలీస్ లు
Hyderabad police gives a shock to Manchu Manoj మంచు మనోజ్ కి షాకిచ్చిన ట్రాఫిక్ పోలీస్ లు
Advertisement
Ads by CJ

ఈమధ్యన న హైదరాబాద్ ట్రాఫిల్ పోలీస్ లు సెలబ్రిటీస్ కి వరసగా షాక్ లు ఇస్తున్నారు. రీసెంట్ గా తమ కార్లకి బ్లాక్ ఫిల్మ్ అద్దాలు అమర్చి మరీ హైదరాబాద్ సిటీలో తిరుగుతున్న కొంతమంది హీరోలకి చలాన్స్ విధించడమే కాదు.. ఆ బ్లాక్ ఫిలిం అద్దాలను తొలగిస్తున్నారు. ఈమధ్యనే అల్లు అర్జున్ అలాగే నందమూరి హీరో కళ్యాణ్ రామ్ లకి ట్రాఫిక్ పోలీస్ లు షాకివ్వడమే కాదు.. 700 రూపాయల జరిమానా విధించి మరీ బ్లాక్ ఫిల్మ్ అద్దాలు తొలగించిన నాలుగు రోజుల్లోపే మంచు మనోజ్ ట్రాఫిక్ పోలీస్ లకి అడ్డంగా దొరికిపోయాడు.

హైదరాబాద్ టోలీచౌకీలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. అటుగా వస్తున్న మంచు మనోజ్ కారుకి నిబంధనలకు విరుద్ధుంగా బ్లాక్ ఫిల్మ్ అద్దాలు అమర్చి ఉండటంతో ఆ కారుని ఆపిన పోలీస్ లు ముందుగా బ్లాక్ ఫిల్మ్‌ను తొలిగించారు. అంతేకాకుండా మంచు మనోజ్ కి కూడా 700 రూపాయల జరిమానా వేశారు. మంచు మనోజ్ నడుపుతున్న కారు నంబర్ AP 39HY 0319కు చలాన్‌ విధించారు. కేవలం మనోజ్ కి మాత్రమే కాదు.. అటుగా వెళుతున్న పలు కార్లకి పోలీస్ లు ఇదే విధంగా బ్లాక్ ఫిలిం తొలగించి చలాన్ విధించారు. 

Hyderabad police gives a shock to Manchu Manoj:

Hyderabad police fine to Manchu Manoj

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ