యశ్ - ప్రశాంత్ నీల్ మరోసారి ఇండియన్ బాక్సాఫీసు దగ్గర అరాచకం సృష్టించడానికి వచ్చేస్తున్నారు. కెజిఎఫ్ తో కళ్ళు చెదిరే కలెక్షన్స్ కొల్లగొట్టిన ఈ కాంబో కెజిఎఫ్ 2 తో అంచనాలు పెంచుకుంటూ పోతున్నారు. రాఖి భాయ్ - విలన్ అధీర ఇంకా చాలామంది విలన్స్ మధ్యనే ప్రధానంగా యాక్షన్ ఉండబోతుంది. ఈమధ్యనే రిలీజ్ అయిన తుఫాన్ సాంగ్, కెజిఎఫ్ చాప్టర్ 2 ట్రైలర్ ప్రస్తుతం ఉన్న అంచనాలను డబుల్ చెసాయి. కెజిఎఫ్ 2 ట్రైలర్ రిలీజ్ అయిన అన్ని భాషల్లో ముఖ్యంగా మెయిన్ మార్కెట్ హిందీ లో రికార్డ్ వ్యూస్ తో ఇప్పటికి ట్రెండ్ అవుతూనే ఉండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా కెజిఎఫ్ 2 కన్నడ వెర్షన్ సెన్సార్ కంప్లీట్ అయ్యింది. సెన్సార్ వాళ్లు కెజిఎఫ్ 2 కి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. 168.06 నిమిషాలు నిడివి అంటే.. 2గంటల 48 నిమిషాల 6 సెకన్లు గా కెజిఎఫ్ 2 నిడివి ఉండబోతుంది. ఇక కెజిఎఫ్ థియేట్రికల్ రైట్స్ కోసం ఆ సినిమాని విడుదల చేస్తున్న ప్రతి భాష నుండి పోటీ నెలకొంది. తెలుగులో ఎలాంటి అంచనాలు లేకుండా 20 కోట్ల షేర్ తెచ్చుకున్న కెజిఎఫ్ కి ఇప్పుడు 50 కోట్ల కి థియేట్రికల్ రైట్స్ కొన్నారంటే ఇక్కడ ఎన్ని అంచనాలు, ఎంత హైప్ ఉందొ అర్ధమవుతుంది. మరి ఏప్రిల్ 14 రాబోతున్న కెజిఎఫ్ 2 కోసం అన్ని భాషల ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు.