ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా వరస ప్రాజెక్ట్ లతో బిజీ బిజీగా ఉంటున్నప్పటికీ మధ్యలో చిన్న చిన్న వెకేషన్స్ కి వెళుతున్న ప్రభాస్ కి రాధే శ్యామ్ చిన్న ఝలక్ ఇచ్చింది. రాధే శ్యామ్ సినిమా విడుదలైన అన్ని భాషల్లో డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో ప్రభాస్ ఫాన్స్ ఫుల్ గా డిస్పాయింట్ అయ్యారు. ఇక రాధే శ్యామ్ విడుదల తర్వాత ప్రభాస్ చిన్నపాటి గ్యాప్ తో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే, సలార్ షూటింగ్స్ లో పాల్గొంటారని, మధ్యలో మారుతి ప్రాజెక్ట్ కూడా ప్రభాస్ చేయబోతున్నారని అనుకున్నారు.
కానీ ఇప్పుడు ప్రభాస్ స్పెయిన్ లో చిన్నపాటి ఆపరేషన్ చేయించుకుని రెస్ట్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. సలార్ షూటింగ్ లో తగిలిన చిన్న గాయం ప్రభాస్ ని ఇబ్బంది పెట్టడంతో.. ఆయన స్పెయిన్ వెళ్లి ఆపరేషన్ చేయించుకున్నట్లుగా తెలుస్తుంది. అధికారికంగా ఆ విషయం బయటికి రాకపోయినా ప్రభాస్ ఆపరేషన్ వలన రెండు నెలలు పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుందట. దాని కోసం ప్రస్తుతం ఆయన చేసున్న సినిమా షూటింగ్స్ వాయిదా పడుతున్నాయని తెలుస్తుంది. సలార్ ఎలాగూ మే నుండి ఫ్రెష్ షెడ్యూల్ మొదలు పెట్టాలనుకుంటే అది జూన్ కి వాయిదా పడే అవకాశం ఉంది అని, మారుతి సినిమా కూడా కాస్త వెనక్కి జరిగినట్లుగా సోషల్ మీడియా టాక్.