వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. ఏప్రిల్ 8 వరల్డ్ వడే గా రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ముఖ్యంగా బాక్సర్ గా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తుంది. ఒక్క కట్ కూడా లేకుండా ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. తాజాగా ఈ సినిమా కి సంబందించిన అన్ని భాషల ఓటిటి, శాటిలైట్ రైట్స్ భారీ డీల్ కి అమ్ముడయ్యాయి. అన్ని భాషలకి కలిపి గని ఓటిటి, శాటిలైట్ రైట్స్ 25 కోట్లకి విక్రయించారు మేకర్స్.
కేవలం ట్రైలర్ మాత్రమే చూసి ఈ సినిమాకు భారీ బిజినెస్ జరిగింది. సినిమాను అద్భుతంగా ఉంటుందని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.