ప్రస్తుతం జబర్దస్త్ లో కామెడీ కళ తప్పింది. కామెడీ చెయ్యడానికి జబర్దస్త్ కమెడియన్స్ మాత్రం కనిపించడం లేదు. ఇటు చూస్తే రోజా కూడా అప్పుడప్పుడు జేడ్జ్ ప్లేస్ లో మిస్ అవుతుంది. ఇప్పుడేమో రోజాకి మంత్రి పదవి రాబోతుంది.. ఇకపై జబర్దస్త్ కామెడీ షో వదిలెయ్యబోతుందేమో అంటూ ప్రచారము షురూ అయ్యింది. ఇక టాప్ కమెడియన్స్ ఎవరూ జబర్దస్త్ లో కనిపించడం లేదు. జబర్దస్త్ లో హైపర్ ఆది, ఎక్స్ట్రా జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ లు కనిపిస్తున్నారు తప్ప పేరున్న కమెడియన్స్ లేరు. దానితో డాన్స్ మాస్టర్స్ ఓ స్కిట్ చేస్తున్నారు.
జబర్దస్త్ జెడ్జెస్ కూడా ఓ స్కిట్ చేస్తూ టైం గడిపేస్తున్నారు. ఇక తాజాగా గురువారం జబర్దస్త్ ఎపిసోడ్ లో హైపర్ ఆది కూడా కనిపించలేదు. డాన్స్ మాస్టర్స్ టీం, రాఘవ టీం, చలాకి చంటి రెండు స్కిట్స్ లో కనిపించారు. కానీ హైపర్ ఆది కనిపించలేదు. మరి ఆది ఎక్కడికి వెళ్ళినా.. జబర్దస్త్ లో కామెడీ పంచెస్ కరువయ్యాయి అంటున్నారు. మరోపక్క రోజా ప్లేస్ లోకి ఇంద్రజ వస్తుంది. అంతేకాకుండా జబర్దస్త్ లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువయ్యాయని, కొత్త జేడ్జ్ ఇంద్రజ ఆ డైలాగ్స్ వినలేకపోతుంది అంటున్నారు నెటిజెన్స్.