నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ టైం పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నారు. బింబిసారా తో కళ్యాణ్ రామ్ పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొట్టడానికి రెడీ అయ్యారు. బింబిసారా ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలు పెంచేసిన కళ్యాణ్ రామ్.. బింబిసారా వంటి ప్రయోగాత్మక చిత్రాన్ని వసిష్ఠ దర్శకత్వంలో చేస్తున్నారు. చారిత్రక నేపథ్యంతో రాజుల కాలం నాటి కథతో రాబోతున్న ఈ మూవీపై ఆరంభంలో పెద్దగా అంచనాలు లేవు. కానీ, కొద్ది రోజుల క్రితమే విడుదలైన ఈ మూవీ టీజర్ ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
ఈ మూవీలో కళ్యాణ్ రామ్ కేథరిన్, సంయుక్త మీనన్ తో రొమాన్స్ చేసున్నారు. ఫస్ట్ లుక్ తర్వాత అప్ డేట్ లేని ఈ మూవీ ఉగాది సందర్భంగా రిలీజ్ డేట్ ప్రకటించారు. కళ్యాణ్ రామ్ బింబిసారా ఆగష్టు 5 న పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా మేకర్స్ అఫీషియల్ గా కళ్యాణ్ రామ్ లుక్ తో ప్రకటించారు. బ్యాగ్రౌండ్ మాత్రమే బ్లాక్ గా కాకుండా కళ్యాణ్ రామ్ బ్లాక్ కోటు, బ్లాక్ కళ్ళద్దాలతో కాస్త డిఫ్రెంట్ గా ఉన్నారు ఈ రిలీజ్ డేట్ పోస్టర్ లో. ఇక ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.