గత అర్ధరాత్రి బంజారాహిల్స్ లోని రాడిసన్ హోటల్ పై టాస్క్ ఫోర్స్ పక్కా సంచారంతో దాడులు నిర్వహించగా.. అక్కడ డ్రగ్స్ తీసుకుంటూ 150 మంది ప్రముఖుల పిల్లలు, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, నిహారిక, ఇంకా ఓ నిర్మాత కూతురు పట్టుబడడం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రాత్రి 10, 11 మధ్యన పబ్స్ అన్ని క్లోజ్ అవ్వాల్సి ఉన్నా.. వీకెండ్ పార్టీ అంటూ రాడిసన్ హోటల్ వాళ్ళు తెల్లవారు ఝామున మూడు గంటలవరకు పబ్ ని నిర్వహించడమే కాకుండా.. ఆ పార్టీలో డ్రగ్స్, కొకైన్ కూడా యూత్ తీసుకోవడంతో టాస్క్ ఫోర్స్ కి వచ్చిన సమాచారంతో వారిని అరెస్ట్ చేసి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించింది.
ఇలా పట్టుబడిన వారిలో అందరూ బడా బాబుల పిల్లలే ఉన్నారని, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, అలాగే నిహారిక(నాగబాబు కూరుతురా.. లేదా అనేది క్లారిటీ లేదు) వంటి ప్రముఖులని అరెస్ట్ చెయ్యగా.. వారు తమని ఎందుకు అరెస్ట్ చేసారంటూ పోలీస్ స్టేషన్ లో నానా రచ్చ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారో అనే దాని మీద పోలీస్ లు దర్యాప్తు చేస్తున్నారని, డ్రగ్స్ తీసుకోనివారిని కౌన్సిలింగ్ ఇచ్చి ఇళ్ళకి పంపిస్తున్నారని తెలుస్తుంది. రాహుల్ సిప్లిగంజ్ కూడా స్టేషన్ నుండి ఇంటికి వెళ్లే సమయంలో మీడియా ఫొటోస్ తియ్యడానికి ప్రయత్నించగా.. అతను వేగంగా కారు దగ్గరకి వెళ్లి కారు ఎక్కి వెళ్లిపోయిన దృశ్యాలు మీడియాలో హైలెట్ అయ్యాయి.