బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదలైనప్పటి నుండి ఆ హౌస్ లో జరిగే గొడవలకన్నా ఎక్కువగా నామినేషన్స్ ప్రక్రియతో పాటుగా వారం వారం ఎలిమినేట్ అవుతున్న కంటెస్టెంట్స్ విషయంలో షాకిస్తూనే ఉంది బిగ్ బాస్ యాజమాన్యం. ఆదివారం సాయంత్రం ఎపిసోడ్ లో తేలాల్సిన ఎలిమినేషన్ ప్రక్రియ శనివారం రాత్రికే లీకులు వచ్చేస్తున్నాయి. బిగ్ బాస్ గత సీజన్స్ మాదిరిగానే ఈ నాన్ స్టాప్ లోనూ లీకులు ఎక్కువయ్యాయి. మొదటి వారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అవ్వగా ఆమె మళ్ళీ నాలుగు వారాల తర్వాత హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత శ్రీ రాపాక, ఆ తర్వాత స్ట్రాంగ్ అనుకున్న ఆర్జే చైతూ, తర్వాత సరయు ఎలిమినేట్ అవ్వగా ఈ వారం మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ షాకిచ్చింది.
బిందు మాధవి, యాంకర్ శివ, స్రవంతి, తేజస్వి, అనిల్, మిత్ర శర్మ, అరియనాలు నామినేషన్స్ లో ఉండగా బిందు మాధవి ఓటింగ్ లో నెంబర్ వన్ పొజిషన్ ని కంటిన్యూ చెయ్యగా తర్వాత యాంకర్ శివ, అరియనా, అనిల్, మిత్ర, తేజస్వి, స్రవంతి వరస స్థానాల్లో ఉన్నారు. కానీ చివరి ప్లేస్ లో మిత్ర - తేజస్వి - స్రవంతి ఉండగా.. ఆల్మోస్ట్ స్రవంతి ఈవారం ఎలిమినేట్ అవుతుందనే అన్నారు. కానీ అనూహ్యంగా తేజస్వి మడివాడ ఈ వారం బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తుంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరైన తేజస్వి అబ్బాయిలతో పోటీ పడి మొదటి వారం కెప్టెన్ అయ్యింది. తర్వాత కూడా ఆమె పెరఫార్మెన్స్ పరంగా బాగానే ఉన్నా.. ఓటింగ్ లో చివరి ప్లేస్ లో ఉండడంతో ఆమెని ఎలిమినేట్ చేసినా.. బిగ్ బాస్ తీరుపై అందరిలో అనుమానం మొదలైంది. రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చిన ఈమె మధ్యలోనే వెళ్లింది. ఇప్పుడు కూడా అదే జరిగిందని అంటున్నారు. అసలైతే స్రవంతి ఎలిమినేట్ అవుతుంది అంటూ చాలా ప్రవేట్ పోల్స్ లో చెప్పగా.. చివరికి తేజస్వి బలయ్యింది అంటున్నారు.