బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ అప్పుడే ఐదు వారాలు పూర్తయ్యిపోయింది. ఈ నాన్ స్టాప్ ఓటిటిలో అఖిల్ సార్థక్ - బిందు మాధవి లు నువ్వా - నేనా అని బిగ్ బాస్ నాన్ స్టాప్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. బిందు మాధవి మైండ్ గేమ్ కి ఆమె ఫాన్స్ ఫిదా అవుతూ ఆమెని సోషల్ మీడియాలో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక అఖిల్ గ్యాంగ్ ని వేసుకుని గేమ్ ఆడుతున్నాడు. అయితే అంతా బాగానే ఉన్నా ఇప్పుడు బిగ్ బాస్ పై ఎలిమినేషన్స్ విషయంలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే ప్రతి వారం స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేస్తున్నారు. వీక్ కంటెస్టెంట్స్ ని మాత్రం కాపాడుతున్నారు. అందులో ఫస్ట్ వీక్ బయటికి వెళుతుంది అనుకున్న మిత్ర శర్మా ఇప్పటికీ హౌస్ లో కొనసాగడంపై అందరిలో అనుమానాలు మొదలయ్యాయి.
గేమ్ అంటే ఆసక్తి ఉండదు, ఎందులోనూ సరిగ్గా పార్టిసిపేట్ చెయ్యదు, అసలు బిగ్ బాస్ హౌస్ కి ఈమె అవసరమా అన్నట్టుగా ఉంటుంది. ఇక ఈమధ్యన మాట్లాడితే ఏడుస్తుంది. ఈ వారం వరెస్ట్ పెరఫార్మెర్ గా జైలుకి వెళ్ళింది. గేమ్ ఆడదు, ఏడుస్తుంది. ఈ రోజు ప్రోమోలోనూ నాగార్జున మిత్ర శర్మకి అదే వార్నింగ్ ఇచ్చారు. అలాంటి మిత్ర శర్మ ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సింది పోయి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని హౌస్ నుండి పంపెయ్యడం ఏమాత్రం అర్ధం కాని విషయం. ఇక ఈ రోజు మళ్ళీ మిత్ర శర్మ సేవ్ అయ్యి తేజస్వి మడివాడ ఎలిమినేట్ అవడం అందరికి షాకిచ్చిన విషయం. మిత్ర శర్మని బిగ్ బాస్ యాజమాన్యం కావాలనే కాపాడుతుంది అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.