గత రాత్రి హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రాడిసన్ హోటల్ పుడ్డింగ్ అండ్ వింక్ పబ్ లో షాకింగ్ గా 150 మంది యూత్ టాస్క్ ఫోర్స్ పోలీస్ లకి పట్టుబడడం కలకలం సృష్టించింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఈ పబ్ నిర్వహించడం గమనార్హం. ఆ పబ్ అర్ధరాత్రి దాటాక కూడా నిర్వాహకులు ఎలాంటి భయం, లేకుండా నిర్వహడంపై చాలా విమర్శలు ఉన్నాయి. ఈ పబ్ కి ఓ ఎంపీ కూతురు ఓనర్ కావడంతో పోలీస్ లు చూసి చూడనట్టుగా వదిలేసినా.. టాస్క్ ఫోర్స్ కి వచ్చిన పక్కా సమాచారంతో గత రాత్రి ఆ పబ్ పై దాడి చెయ్యగా అందులో సెలబ్రిటీస్ పిల్లలు, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా డాటర్ నిహారిక ఉండడం సంచలనం అయ్యింది. నిహారిక ని కూడా అరెస్ట్ చేసి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించిన క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పబ్ లో జరిగిన పార్టీలో చాలామంది డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా అనుమానులున్నాయని.. డ్రగ్స్ తీసుకోని వారిని కౌన్సిలింగ్ ఇచ్చేసి ఇంటికి పంపేశారు పోలీస్ లు.
అయితే మెగా డాటర్, నాగబాబు కూతురు నిహారిక ఈ రైడింగ్ లో పట్టుబడడంతో, ఆమె డ్రగ్స్ తీసుకుంది అని, మెగా ఫ్యామిలీ పరువు పోయింది అంటూ మీడియాలో అనేకరకాల వార్తలు ప్రచారంలోకొవచ్చాయి. దానితో నాగబాబు తన కూతురు నిహారిక అరెస్ట్ పై వెంటనే స్పందించారు. గత రాత్రి రాడిసన్ పబ్ జరిగిన దాడి పై తాను ఇలా స్పందించడానికి కారణం నాకూతురు నిహారిక అక్కడ ఆ సమయంలో ఉండడమే అని. పబ్ పరిమితికి మించి నడపడంతో ఆ పబ్ మీద పోలీస్ యాక్షన్ తీసుకున్నారని, నిహారిక కి సంబందించిన వరకు షి ఈజ్ క్లియర్. పోలీస్ ఇచ్చిన సమాచారం ప్రకారం నిహారిక విషయంలో ఎలాంటి తప్పులేదని వారు చెప్పారు. సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వస్తున్న అన్ వాంటెడ్ స్పెక్యులేషన్స్ స్ప్రెడ్ చెయ్యకుండా ఆపేయ్యాలంటూ నాగబాబు విన్నవించుకున్నారు.