ట్రిపుల్ ఆర్ సక్సెస్ తో అందులో నటించిన స్టార్ హీరోస్ రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫుల్ ఖుషీగా వున్నారు. వరల్డ్ వైడ్ గా ట్రిపుల్ ఆర్ కలెక్షన్స్ ప్రభంజనం సృష్టిస్తుంది. ఎన్టీఆర్ ఇంకా బాలీవుడ్ మీడియా కి టచ్ లోనే ఉన్నారు. రామ్ చరణ్ రీసెంట్ గా తన తదుపరి మూవీ ఆచార్య డబ్బింగ్ కార్యక్రమాలను ముగించుకుని ముంబై ఫ్లైట్ ఎక్కారు. రామ్ చరణ్ ఈ రోజు ముంబై ప్రవేట్ ఎయిర్ పోర్ట్ లో మీడియాకి చిక్కారు. ఆయన ఈమధ్యన వ్యాపార లావాదేవీల నిమిత్తం తరచూ ముంబై వెళుతున్నారు. ఇప్పుడు కూడా రామ్ చరణ్ అందుకే ముంబై వెళ్లి ఉంటారని అనుకుంటున్నారు.
ఇక రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ లో బ్రిటిష్ పోలీస్ గాను, అల్లూరి సీతారామరాజుగాను మంచి పెరఫార్మెన్స్, బాడీ ట్రాన్స్ ప్లాంటేషన్ చూపించారు. అయితే ట్రిపుల్ ఆర్ సూపర్ సక్సెస్ అవడంతో సినిమా కోసం పని చేసిన వివిధ శాఖలకు చెందిన హెచ్ఓడీలను ఈ ఉదయం అల్పాహారం కోసం పిలిపించి వారందరికీ ఊహించని బహుమతి అందించారు. సినిమా కోసం పని చేసిన వివిధ విభాగాల అధిపతులను, కెమెరా అసిస్టెంట్లను, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్లను, మేనేజర్లను, అకౌంటెంట్లను, స్టిల్ ఫోటోగ్రాఫర్ అసిస్టెంట్లను ఇలా దాదాపు అన్ని విభాగాలకు చెందిన సుమారు 35 మందిని ఇంటికి అల్పాహారం కోసం పిలిపించారు. వారితో కాస్త సమయం గడిపిన రామ్ చరణ్ అనంతరం వారందరికీ ఒక్కొకరికి ఒక్కో తులం బంగారం కాయిన్ కానుకగా ఇవ్వడమే కాక వారికి ఒక కేజీ స్వీట్ బాక్స్ కూడా అందించి సినిమా కోసం పని చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. సినిమా ఇంత అద్భుతంగా రావడంలో వారి పాత్ర కూడా ఉందని ఈ సందర్భంగా రామ్ చరణ్ వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించిన సందర్భంగా రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశారు.
ఇంతకుముందు బన్నీ కూడా తన సినిమాలు సక్సెస్ అయినప్పుడు తమ సినిమా యూనిట్ కి ఇలాంటి గిఫ్ట్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు చరణ్ కూడా ఆ లిస్ట్ లోకి చేరిపోయారు.