ఏప్రిల్ 14 బాక్సాఫీసు వద్ద ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతుంది. పాన్ ఇండియా లెవల్లో భారీ హైప్ తో కన్నడ సంచలన కెజిఎఫ్2 రిలీజ్ అవ్వబోతుంది. దానికి ఒకరోజు ముందే విజయ్ మాస్ బీస్ట్ రాబోతుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన బీస్ట్ ట్రయిలర్, కేజిఎఫ్ 2 ట్రయిలర్ మాస్ ఫాన్స్ కి బాగా ఎక్కేసేలా కనిపిస్తున్నాయి. కెజిఎఫ్ తో హిట్ కొట్టిన యశ్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబో ఇప్పుడు కెజిఎఫ్2 తో మరిన్ని రికార్డులు సెట్ చెయ్యడానికి రెడీ అయ్యారు. అలాగే కోలీవుడ్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్న విజయ్ బీస్ట్ మూవీ ట్రైలర్ ఆయన ఫాన్స్ కే కాదు, తమిళ్ ఆడియన్స్ మొత్తానికి కిక్ ఇచ్చేదిగా ఉంది. అందుకే ఏ హీరో తగ్గేదెలా అంటున్నారు. ఎవరి సినిమాల మీద వాళ్ళకి విపరీతమైన నమ్మకం ఉంది.
ప్రశాంత్ నీల్ వాళ్ళు ముందే కెజిఎఫ్ రిలీజ్ డేట్ లాక్ చేసినా.. విజయ్ కావాలనే కాలు దువ్వుతున్నారు. కెజిఎఫ్ అంటే పాన్ ఇండియా ఫిలిం. బీస్ట్ తెలుగు, తమిళ్ కే పరిమితం. అందులోను తెలుగులో విజయ్ సినిమాలు వరసగా ఫెయిల్ అవుతున్నాయి. తమిళ్ లో మాత్రం విజయ్ సినిమాకి ఎలాంటి టాక్ వచ్చినా అది సూపర్ హిట్ అవడం ఖాయం. ఇక కెజిఎఫ్ కూడా విడుదలైన అన్ని భాషల్లో సంచలన విజయం నమోదు చెయ్యడంతో కెజిఎఫ్ 2 పై విపరీతమైన అంచనాలున్నాయి. బీస్ట్ కి ఎంతగా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా.. ఏప్రిల్ 14 న కెజిఎఫ్ 2 హావ మొదలు కావడం ఖాయం. సో బాక్సాఫీసు ఫైట్ ఎలా ఉన్నా ఏప్రిల్ 13, 14 మూవీ లవర్స్ కి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అన్నమాట.