ట్రిపుల్ ఆర్ తో సౌత్ కి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. ఆ సినిమాలో సీత కేరెక్టర్ లో చాలా అందంగా కనిపించడమే కాకుండా.. ఉన్న కాసేపు చక్కటి పెరఫార్మెన్స్ తో అదరగొట్టేసింది. తర్వాత సౌత్ లోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మూవీ ఓకె చేసింది. ఇక బ్రహ్మాస్త్ర మూవీ తో సెప్టెంబర్ లో బాయ్ ఫ్రెండ్ తో మరోసారి ఆడియన్స్ ని అలరించడానికి రెడీ అవుతున్న అలియా భట్ ఈ నెలలోనే ప్రియుడు, ఇష్టసఖుడు రణబీర్ కపూర్ తో పెళ్లి పీటలెక్కబోతుంది అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.
ఎప్పటినుండో రణబీర్ - అలియా భట్ పెళ్లి కబురు కోసం బాలీవుడ్ ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి వలన లాక్ డౌన్ తో పెళ్లి చేసుకోలేకపోయామని చెప్పిన ఈ జంట ఈ నెలలో ఒక్కటి కాబోతున్నారట. ముంబైలోకి కపూర్స్ ఫ్యామిలీకి అచ్చొచ్చిన మహల్ లోనే వీరి పెళ్లి జరగబోతుంది అని తెలుస్తుంది.
ఇక అలియా భాట్ తాజాగా ఓ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ పిక్ లో అలియా భట్ అందం ద్విగుణీకృతం అయ్యేలా సూర్య కిరణాలూ మీద పడుతుంటే.. అలియా భట్ బంగారు వర్ణంలో మెరిసిపోతూ సన్ షైన్ బ్యూటీ లా కనిపిస్తుంది. చేతిలో పూలు, లూజ్ హెయిర్, ఎల్లో కలర్ డ్రెస్ తో అలియా భట్ దేవకన్యలా సూర్య కిరణాల కాంతితో మెరిసిపోతుంది.