విజయ్ దేవరకొండ సరసన లైగర్ మూవీలో నటిస్తున్న అనన్య పాండే బాలీవుడ్ లో మంచి పాపులర్ ఫిగర్. అక్కడ సినిమాలతోను, అలాగే జిమ్ వీడియోస్ తోనూ మంచి క్రేజ్ ఉన్న అనన్య పాండే కి బాలీవుడ్ లో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతనే హీరో షాహిద్ కపూర్ బ్రదర్ ఇషాన్ కట్టర్. అనన్య పాండే 2020లో ఇషాన్ కట్టర్‌తో కలిసి ఖాలీ పీలీ సినిమాలో నటించింది. ఆ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవ్వలేదు కానీ ఓటిటి లో రిలీజ్ అయ్యింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే అనన్య పాండే - ఇషాన్ పరిచయం ప్రేమగా మారి.. పార్టీలకి, వెకేషన్ కి వెళ్లేంత డెవెలెప్ అయ్యింది
కొన్నాళ్ల క్రితం రాంథాంబర్ నేషనల్ పార్క్‌కు విహార యాత్రకు వెళ్లడంతో ఇషాన్ - అనన్య ల ప్రేమ వ్యవహారం మీడియాకి చిక్కింది. ఆ టూర్ లో వీరిద్దరూ ఎంజాయ్ చేసిన విషయాలు మీడియాలో హైలెట్ అయ్యాయి. అప్పటినుండి వీళ్ళు ఎక్కడికి వెళ్లినా మీడియా కి దొరికిపోతూనే ఉన్నారు. కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్న ఈ క్యూట్ జంట విడిపోయింది అనే ప్రచారం బాలీవుడ్ మీడియాలో మొదలయ్యింది. అనన్య పాండే - ఇషాన్ కట్టర్ లు పరస్పర అంగీకారంతో బ్రేకప్ చేసుకున్నట్లుగా సమాచారం. వారిద్దరూ బ్రేకప్ తో విడిపోయారని, కానీ వారు స్నేహ సంబంధాన్ని కొనసాగిస్తారంటూ సదరు బాలీవుడ్ వెబ్ సైట్స్ లో కథనాలు ప్రసారం అవుతున్నాయి.