Advertisementt

మూడు భాషల్లో కెజిఎఫ్ 2 కి చెక్

Tue 05th Apr 2022 11:43 AM
vijay,beast,yash,kgf 2,nelsen,prashanth neel,beast in 3 languages,kgf 2 pan india film  మూడు భాషల్లో కెజిఎఫ్ 2 కి చెక్
Check for KGF2 in three languages మూడు భాషల్లో కెజిఎఫ్ 2 కి చెక్
Advertisement
Ads by CJ

ఏప్రిల్ 14 న వరల్డ్ వైడ్ రికార్డ్ థియేటర్స్ లో పాన్ ఇండియా మూవీ గా రాబోతున్న కెజిఎఫ్ 2 కి అడుగడుగునా విజయ్ అడ్డం పడుతున్నారు. తమిళంలో విపరీతమైన క్రేజ్ ఉన్న విజయ్ బీస్ట్ మూవీ ని ఏప్రిల్ 13 నే రిలీజ్ చేస్తూ కెజిఎఫ్ 2 కి చెక్ పెట్టారు. అయితే బీస్ట్ కేవలం తెలుగు, తమిళం కే పరిమితమవుతుంది. తమిళంలో ఉన్న క్రేజ్ బీస్ట్ కి తెలుగులో ఉండదు.. దానితో కెజిఫ్ 2 కి ప్రాబ్లెమ్ ఉండదు అనుకుంటే.. ఇప్పుడు విజయ్ బీస్ట్ హిందీలోనూ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. 

తెలుగు, తమిళ్, హిందీలో విజయ్ బీస్ట్ విడుదల కాబోతుంది. అలా కెజిఎఫ్ కి మూడు భాషల్లో విజయ్ చెక్ పెట్టేసారు. అటు ఓవర్ సీస్ లోను బీస్ట్ మూవీ కి హిట్ టాక్ పడితే కెజిఎఫ్ కి కష్టమే. యశ్ - ప్రశాంత్ నీల్ ముందుగానే కెజిఎఫ్ 2 రిలీజ్ డేట్ ఇచ్చినా విజయ్ లేట్ గా బీట్స్ రిలీజ్ డేట్ ఇచ్చి.. ఇప్పుడు నానా హడావిడి చేస్తున్నారు. కెజిఎఫ్ 2 కి అడ్డం పడుతున్నారు. కెజిఎఫ్ 2 అంచనాలు ముందు బీస్ట్ నిలబడుతుందా అంటే విజయ్ మాములు హీరో కాదు. కోలీవడ్ లో విపరీతమైన పాపులారిటీ ఉన్న హీరో. కానీ తెలుగు, హిందీలో విజయ్ కి అంతగా మర్కెట్ లేదు. క్రేజ్ లేదు. సో ఆ విధంగా కెజిఎఫ్ 2 సేఫ్ అయ్యే అవకాశం మాత్రం ఉంది.

Check for KGF2 in three languages:

Vijay Beast vs Yash KGF 2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ