బిగ్ బాస్ నాన్ స్టాప్ హాట్ స్టార్ లో మొదలైనప్పటినుండి ఓ కంటెస్టెంట్ హౌస్ లోని వారందరిని ఇరిటేట్ చేస్తూనే ఉంది. అలాగే గత ఐదు వారాలుగా ఆమె ఎలిమినేట్ అవ్వాల్సిన.. ఎలిమినేట్ చేయకుండా బిగ్ బాస్ కాపాడుతుంది అనే అనుమానాలు ఇప్పుడు హౌస్ మేట్స్ లోనే కాదు బిగ్ బాస్ ఆడియన్స్ లోనూ ఉంది. ఆమె ఎవరో కాదు.. మిత్ర శర్మ. మిత్ర శర్మ అటు గేమ్ ఆడదు, ఇటు హౌస్ మేట్స్ తో సరిగ్గా ఉండదు. అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ చెబుతుంటుంది. మాములుగా అయితే ఏడుస్తూనే ఉంటుంది. గత వారం నామినేట్ అయిన తేజస్వి.. నేను బయట ఉండి.. మిత్రా లోపల ఉంది అంటేనే బిగ్ బాస్ గేమ్ ఏమిటో అందరికి అర్ధం అవుతుంది అన్నట్టుగానే మిత్ర శర్మ ఇప్పటికి ఎలిమినేట్ అవ్వకపోవడం నిజంగా గ్రేట్.
అయితే గత రాత్రి నామినేషన్స్ విషయంలో మిత్రా శర్మ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. యాంకర్ శివని నానా రకాలుగా తిప్పలు పెట్టి బిగ్ బాస్ తో చివాట్లు తిన్నది. ఇక ఈ రోజు మంగళ వారం హౌస్ మేట్స్ లో ఎవరు మోస్ట్ ఇరిటేటెడ్ పర్సనో ఓట్ చెయ్యమంటే చాలామంది రాత్రి మిత్ర శర్మ చేసిన గొడవ వల్ల సఫర్ అయ్యామంటూ ఆమెకి ఎక్కువ ఇరిటేటెడ్ పర్సన్ గా జెండాలు ఇచ్చారు. ఇక నటరాజ్ కి స్రవంతి, బిందు, అనిల్ ఇరిటేటెడ్ పర్సన్ జెండా ఇచ్చారు. అయితే మిత్ర శర్మకి వచ్చిన జెండాలు చూసి నేను వీటిని పాజిటీవ్ గానే తీసుకుంటాను అనగా.. వద్దు నువ్వు సీరియస్ గా తీసుకో.. పాజిటివ్ గా తీసుకోకు.. అన్ని ఇరిటేటెడ్ పర్సన్ జెండాలు వచ్చా క అయినా నువ్వు మారు అంటూ అరియనా, ముమైత్ లు మిత్రాకి చెప్పారు.