Advertisementt

రణబీర్-అలియా ఇంటిముందు మీడియా టెంట్

Wed 06th Apr 2022 05:14 PM
funny memes,media tent,ranbir kapoor-alia bhatt,ranbir kapoor,alia bhatt,ranbir kapoor-alia bhatt wedding  రణబీర్-అలియా ఇంటిముందు మీడియా టెంట్
Media tent in front of Ranbir-Alia house రణబీర్-అలియా ఇంటిముందు మీడియా టెంట్
Advertisement
Ads by CJ

ప్రస్తుతం అలియా భట్ అటు గంగూభాయ్ కతీయవాడి సినిమా తో 100 కోట్ల క్లబ్బులోకి కాలు పెట్టడమే కాకుండా, ట్రిపుల్ ఆర్ సినిమాతో హిందీలోనూ బ్లాక్ బస్టర్ కొట్టింది. అది మాత్రమేనా అలియా భట్ తాను పేమించిన ప్రియుడు రణబీర్ కపూర్ తో ఈ నెలలోనే ఏడడుగులు వెయ్యడానికి సిద్ధమైపోయింది. అటు రణబీర్ కపూర్ ఇల్లు, ఇటు అలియా భట్ హౌస్ రెండూ పెళ్లి పనులతో తీరిక లేకుండా ఉన్నాయట. ముంబై లోనే అలియా భట్-రణబీర్ కపూర్ వివాహం జరుగుతున్నా అటు మీడియా కి కానీ, ఇటు బయట వారికీ కానీ ఎలాంటి లీకులు లేకుండా జాగ్రత్త పడుతుంది ఈ జంట. మరి పెళ్లి విషయం బయట పెట్టకుండానే అలియా, రణబీర్ కపూర్ లు పెళ్లి పనులతో పాటుగా తమ పెళ్ళికి ఆహ్వానాలు కూడా అందజేస్తున్నారట. బాలీవుడ్ ప్రముఖులని ఈ పెళ్ళికి అహ్వానించబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇంత జరుగుతున్నా అలియా భట్ కానీ, రణబీర్ కపూర్ కానీ పెళ్లి విషయం స్పందించడం లేదు. కానీ మీడియా వదలదుగా.. ఎవరు ఎక్కడ కనిపిస్తారా.. ప్రశ్నలు వేసేసి పెళ్లి ముచ్చట్లు కనుక్కుని ఫొటోస్ తీసేందుకు రెడీ అవ్వడంతో.. ఇప్పుడు సోషల్ మీడియాలో మీమర్స్ కొత్త కొత్త మీమ్స్ చేస్తూ నవ్వించేస్తున్నారు. అదెలా అంటే అలియా భట్, రణబీర్ తమ పెళ్లి ఏప్రిల్ 17 అని పెదవి విప్పడం లేదు. కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా ఎమన్నా చెబుతారేమో, లేదంటే రణబీర్ కానీ, అలియా భట్ కానీ దొరుకుతారేమో అని మీడియా వాళ్ళు రణబీర్ కపూర్, అలియా భట్ ఇళ్ల ముందర టెంట్ వేసుకుని.. వంటా వార్పు చేసుకుంటూ కాపలాగా కూర్చోవాల్సిందే అంటూ ఫొటోస్ డిజైన్ చేసి సోషల్ మీడియాలో మీమ్స్ చేస్తూ ఫన్ చేస్తున్నారు. 

Media tent in front of Ranbir-Alia house:

Funny Memes: Media tent in front of Ranbir Kapoor-Alia Bhatt house

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ