వరుణ్ తేజ్ ప్రస్తుతం గని ప్రమోషన్స్ లో యాక్టీవ్ గా ఉండాల్సింది. ఎందుకంటే ఏప్రిల్ 8 న గాని రిలీజ్ కాబోతుంది. నాలుగైదుసార్లు పోస్ట్ పోన్ అయ్యి ఎట్టకేలకు ఏప్రిల్ 8 న ఆడియన్స్ ముందుకు రాబోతున్న గని పై మంచి ఎక్సపెక్ట్షన్స్ ఉన్నాయి. వరుణ్ తేజ్ బాక్సర్ గా నటించిన ఈ సినిమాని అల్లు బాబీ నిర్మించగా కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేసారు. అయితే గని ప్రమోషన్స్ లో వరుణ్ తేజ్ ని మీడియా ఖచ్చితంగా నిహారిక ఎపిసోడ్ పై ప్రశ్నలు వెయ్యడం ఖాయం. అందుకే మీడియా వారికి ముందే నిహారిక ప్రశ్నలు రేజ్ చెయ్యొద్దని సదరు పీఆర్వో మీడియా కి చెప్పారట.
ఉగాది రోజున హైదరాబాద్ లోని రాడిసన్ పబ్ లో నిహారిక టాస్క్ ఫోర్స్ కి అడ్డంగా దొరికిపోయి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. నాగబాబు గారు మా అమ్మాయి డ్రగ్స్ తీసుకోలేదు, మా అమ్మాయి పబ్ కి అయితే వెళ్ళింది, పబ్ వాళ్లదే తప్పు ఆ టైం వరకు తెరిచి ఉంచడం అని చెప్పినా.. ఈ వ్యవహారం ఇప్పటికీ మీడియాలో హాట్ హాట్ గానే ఉంది. ఇలాంటి టైం లో వరుణ్ తేజ్ ని చెల్లెలి గురించి అడక్కుండా మీడియా వదుల్తుందా.. రీసెంట్ గా జరిగిన వరుణ్ తేజ్ ఇంటర్వ్యూలో వరుణ్ యాక్టీవ్ గా లేడని, కాస్త డల్ గానే ఉన్నాడని తెలుస్తుంది. మరి వరుణ్ తేజ్ మీడియా ని ఎలా ఫేస్ చేస్తున్నాడో అంటూ ఆయన ఫాన్స్ కాస్త కంగారుగానే ఉన్నారు.