Advertisementt

ఆదిపురుష్ హడావిడి లేదుగా

Thu 07th Apr 2022 02:39 PM
prabhas,adipurush first look,sri rama navami,om raut  ఆదిపురుష్ హడావిడి లేదుగా
Adipurush first look for Sri Rama Navami? ఆదిపురుష్ హడావిడి లేదుగా
Advertisement
Ads by CJ

ప్రభాస్ ప్రస్తుతం మారుతి మూవీ అలాగే ప్రశాంత్ నీల్ సలార్, ఇంకా నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె షూటింగ్స్ కోసం రెడీ అవుతున్నారు. రాధే శ్యామ్ లో లుక్ విషయంలో విమర్శల పాలైన ప్రభాస్ ఇప్పుడు లుక్ మార్చే ప్రయత్నంలో ఉన్నారని, అలాగే బరువు విషయంలోనూ ప్రభాస్ కేర్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ షూటింగ్ ఎప్పుడో పూర్తయినా ఇంకా గ్రాఫిక్ వర్క్స్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఓం రౌత్ వాళ్ళు బిజిగా ఉన్నారు. ఆదిపురుష్ డేట్ ని ఆగష్టు నుండి జనవరి 2023 కి మార్చారు. అందుకే ఆదిపురుష్ పనులన్ని కూల్ గా చేస్తున్నారు. ఇకపోతే శ్రీరామ నవమికి ఆదిపురుష్ నుండి ప్రభాస్ లుక్ కానీ టీజర్ కానీ రాబోతుంది అంటూ గత వారం ఫాన్స్ నానా హడావిడి చేశారు.

సోషల్ మీడియాలో ఆదిపురుష్ ని ట్రెండ్ చేసారు. కానీ మరో రెండు రోజుల్లో రాబోతున్న శ్రీరామ నవమికి ఆదిపురుష్ నుండి ఎలాంటి స్పెషల్ వచ్చేలా కనిపించడం లేదు. ఎందుకంటే కనీసం నాలుగైదు రోజుల ముందే శ్రీరామ నవమికి ఆదిపురుష్ నుండి రాబోయే స్పెషల్ పై అప్ డేట్ వచ్చేది. ఫాన్స్ సోషల్ మీడియాలో హడావిడి మొదలు పెట్టేసేవారే. కానీ ఆదిపురుష్ టీం నుండి అప్ డేట్ లేదూ.. చడీ చప్పుడు లేదూ. అంతా సైలెంట్ గా అన్నారు. సో దీనిని బట్టి శ్రీరామ నవమి స్పెషల్ గా ఆదిపురుష్ నుండి ఎలాంటి అప్ డేట్ లేదేమో అనే అనుమానం మాత్రం కలుగుతుంది. ఇక ఆదిపురుష్ కోసం ప్రభాస్ బరువు తగ్గి, లుక్ చేంజ్ చేసారంటూ ఓం రౌత్ ఈమధ్యన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. చూద్దాం ఆదిపురుష్ కోసం ప్రభాస్ మోడరన్ రాముడిగా ఎలాంటి వేరియేషన్ చూపిస్తారో అనేది. 

Adipurush first look for Sri Rama Navami?:

Prabhas Adipurush First Look on Sri Rama Navami?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ