మహేష్ బాబు కూతురు సితార కి ఎంత టాలెంట్ ఉందో.. సోషల్ మీడియాలో సితార కి ఎంత క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెలెబ్రిటీ కిడ్ గానే కాదు.. సితార కి స్పెషల్ టాలెంట్స్ చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా డాన్స్. సితార తల్లి నమ్రత శిరోద్కర్ సితార తండ్రి మహేష్ సినిమాల సాంగ్స్ కి వేసే డాన్స్ లని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఈమధ్యనే కళావతి సాంగ్ కి అద్భుతంగా డాన్స్ చేసిన సితార.. సర్కారు వారి పాట పెన్నీ సాంగ్ నుండే సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇవ్వబోతుంది. మహేష్ బాబు పెన్నీ సాంగ్ కి మహేష్ ఎంత మాస్ గా క్యూట్ గా డాన్స్ చేసారో.. సితార పాప అంతకన్నా క్యూట్ గా డాన్స్ చేసింది.
ఇక నేడు శ్రీరామ నవమి సందర్భంగా మహేష్ బాబు తన కూతురు సితార కూచిపూడి డాన్స్ వీడియో ను చేసారు. సితార ఫస్ట్ కూచిపూడి డాన్స్ అది కూడా శ్రీరామనవమి సందర్భంగా చెయ్యడం.. దానిని వీడియో రూపంలో మీతో పంచుకోవడం చాలా హ్యాపీ గా ఉంది అంటూ ఆ వీడియో ని షేర్ చేసారు. అంతేకాకుండా సితు పాప.. నువ్వు చేసే ప్రతి పనిలో చూపించే శ్రద్ద.. నన్ను గర్వపడేలా చేస్తున్నావ్. మా సితారకి డాన్స్ నేర్పించిన అరుణ భిక్షు, మహతి బిక్షులకి కృతఙ్ఞతలు అంటూ మహేష్ షేర్ చేసారు. నిజంగా సితార పాపే కూచిపూడి డాన్స్ ట్రెడిషనల్ వేర్ లో ఇరగదీసింది.