Advertisementt

ఎన్టీఆర్ సినిమాపై ప్రశాంత్ నీల్ అప్ డేట్

Sun 10th Apr 2022 10:21 PM
prashanth neel,ntr 31 update,young tiger ntr,tarak,ntr31  ఎన్టీఆర్ సినిమాపై ప్రశాంత్ నీల్ అప్ డేట్
Prashanth Neel on NTR 31 update ఎన్టీఆర్ సినిమాపై ప్రశాంత్ నీల్ అప్ డేట్
Advertisement
Ads by CJ

కెజిఎఫ్ 2 తో ప్రశాంత్ నీల్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. కన్నడ సంచలనం ప్రస్తుతం కెజిఎఫ్ రిలీజ్ టెంక్షన్ లో ఉండడం కాదు.. టాలీవుడ్ స్టార్స్ తో చేసే సినిమాలతో చిన్న చిన్న అప్ డేట్స్ ఇస్తూ ఆయా స్టార్స్ ఫాన్స్ అటెంక్షన్ కెజిఎఫ్ 2 పై పడేలా చేస్తున్నారు. గత కొన్ని రోజులూగా ప్రభాస్ సలార్ పై అప్ డేట్స్ ఇస్తున్న ప్రశాంత్ నీల్ ఈమధ్యన జరిగిన కెజిఎఫ్ 2 ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తో తనకున్న స్నేహ బంధంపై, ఆయనతో చెయ్యబోయే మూవీ పై మాట్లాడి అటు ఎన్టీఆర్ ఫాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తూ ఆ ఫాన్స్ ని పడేసారు. 

ఎన్టీఆర్ సినిమాలంటే తనకి ఇష్టం అని, 15, 20 ఏళ్ళ నుండి తాను ఎన్టీఆర్ ఫ్యాన్ ని అని, ఎన్టీఆర్ తో నా స్నేహం గత రెండున్నరేళ్లుగా కొనసాగుతుంది అని, మా సినిమా ఓకె అయ్యి స్క్రిప్ట్‌ వర్క్‌ ప్రారంభించాక 10 - 15 సార్లు మీటయ్యాం అని, ఎన్టీఆర్ కి స్క్రిప్ట్‌ నచ్చడంతో దానిపై పూర్తిగా వర్క్‌ చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ తో చెయ్యబోయే మూవీ గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాను. కాకపోతే ఆ సినిమా ఏ జోనర్ అనేది దయచేసి నన్ను అడగొద్దు అంటూ ప్రశాంత్ నీల్ ట్విస్ట్ ఇచ్చారు.

Prashanth Neel on NTR 31 update:

Prashanth Neel about Young tiger NTR

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ