Advertisementt

అజిత్ AK61 కోసం చెన్నై సెట్

Mon 11th Apr 2022 09:32 AM
ajith kumar,ak61,hyderabad,chennai,h vinod  అజిత్ AK61 కోసం చెన్నై సెట్
Ajith AK61 update అజిత్ AK61 కోసం చెన్నై సెట్
Advertisement
Ads by CJ

అజిత్.. దర్శకుడు H వినోద్ తో చేసిన వలిమై మూవీ తర్వాత మరోసారి వినోద్ దర్శకత్వంలోనే తన AK61 మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఎక్కువ శాతం హైదరాబాద్ లో ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. అజిత్ AK61 షూటింగ్ కోసం రెండు రోజుల క్రితమే స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ వచ్చేసారు. అయితే హైదరాబాద్ లోని ఓ ప్రముఖ స్టూడియో లో AK61 కోసం ఓ భారీ సెట్ ని నిర్మిస్తున్నారట. చెన్నై మౌంట్ రోడ్ అలాగే బ్యాంకు సెట్ ని నిర్మిస్తున్నారట. ఈ సెట్ లోనే ఓ రెండు నెలల పాటు AK61 షూటింగ్ ప్లాన్ చేసారని.. ఈ సినిమా బ్యాంకు చుట్టూ తిరిగే కథ కావడంతో.. ఆ బ్యాంకు సెట్ ని భారీగా నిర్మిస్తున్నారని తెలుస్తుంది. 

ఇక ఈ సినిమాలో టబు అండ్ ఐశ్వర్య రాయ్ ల పేర్లు వినిపించినా.. ఇప్పుడు వినోద్ సౌత్ హీరోయిన్స్ తోనే అజిత్ సినిమా చెయ్యాలని డిసైడ్ అవడంతో.. సౌత్ లో ప్రముఖ హీరోయిన్స్ ని సంప్రదించే పనిలో ఉన్నారని.. అజిత్ తో చెయ్యబోయే ఈ మూవీ కూడా యాక్షన్ ప్రధానంశంగా ఉండబోతుంది అని తెలుస్తుంది. ఈ సినిమా కోసమే అజిత్.. గెడ్డం పెంచి కొద్దిగా లుక్ చేంజ్ చేసారు. ఇక AK61 మ్యూజిక్ డైరెక్టర్ గా జిబ్రాన్ వ్యవహరిస్తున్నారు. AK61 షూటింగ్ అఫీషియల్ గా ఈ రోజే హైదరాబాద్ లో మొదలుపెట్టినట్లుగా సమాచారం.

Ajith AK61 update:

Actor Ajith Kumar to start shooting for AK61 in Hyderabad from Today

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ