Advertisementt

బిగ్ బాస్: అఖిల్ vs బిందు మాధవి

Mon 11th Apr 2022 01:58 PM
bigg boss,bigg boss non stop,akhil vs bindu madhavi,akhil sarthak,bindu madhavi  బిగ్ బాస్: అఖిల్ vs బిందు మాధవి
Bigg Boss Non Stop: Akhil vs Bindu Madhavi బిగ్ బాస్: అఖిల్ vs బిందు మాధవి
Advertisement
Ads by CJ

గత రాత్రి నాగార్జున వచ్చారు ఇద్దరు కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేసేసారు. ఇక ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైపోయింది. ఆ ప్రక్రియ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వారం నామినేషన్స్ లో హమిద కి అనిల్ కి మధ్యన కొద్దిగా గొడవ జరిగింది. అనిల్ నీ పెరఫార్మెన్స్ ఈ వారం తక్కువ ఉంది అంటే.. నేను ఆటలో ఎంత ఆడాలో అంతే ఆడాను. నా వంతు నేను ట్రై చేశాను అని అనిల్ అన్నాడు. తర్వాత నటరాజ్ మాస్టర్ కి యాంకర్ శివ కి మధ్య గట్టిగానే గొడవ జరిగింది. శివ నటరాజ్ ని నామినేట్ చెయ్యగా.. నీకన్నా నేను బెటర్ గా ఇంట్లో ఉన్నాను అన్నాడు నటరాజ్. దానితో మీలా నోటికి వచ్చినట్లుగా మాట్లాడడం లేదు అన్నాడు.  దాంతో దొంగ వేషాలు వేయడం మానుకో అని నటరాజ్ అనగానే.. అవే మానుకోండి అంటూ శివ గట్టిగ గొడవ పడ్డాడు.

ఇక బిందు మాధవి కి అఖిల్ కి మధ్యన ఇంటి సభ్యులే షాకయ్యేలా గొడవ జరిగింది. గతవారం బిందు నిన్ను ఏ పాయింట్‌పై నేను నామినేట్ చేశానో అదే ఇప్పుడు కూడా కొనసాగుతున్నది. నీ అగ్రెసివ్ ఇంకా తగ్గలేదు అని అన్నాడు. అయితే ఫిజికల్‌గా వెళ్దాం అంటూ స్టార్ట్ చేసింది మీరే. నా ఎమోషన్స్‌ను యూజ్ చేసుకొన్నది నువ్వే.. అంటూ బిందు మాధవి కోపంతో రెచ్చిపోయింది. అఖిల్ కూడా తగ్గలేదు. బిందు మాధవి కాస్త గట్టిగానే ఏయ్ అఖిల్‌గా, ఏం చెప్పాలిరా? అని అంటే.. దానికి అఖిల్ కూడా ఏయ్ బిందు నీకు ఏం చెప్పాలే అంటూ అఖిల్ స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చాడు.. వారి మధ్య గొడవతో ఇంటి సభ్యులు అవాక్కయ్యారు.

Bigg Boss Non Stop: Akhil vs Bindu Madhavi:

Bigg Boss Non Stop: Today Nominations heat

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ