Advertisementt

అలియా-రణబీర్ పెళ్ళికి గెస్ట్ లు లేరా

Mon 11th Apr 2022 04:03 PM
alia bhatt,ranbir kapoor,wedding,rahul bhatt,alia bhatt - ranbir kapoor wedding  అలియా-రణబీర్ పెళ్ళికి గెస్ట్ లు లేరా
Alia Bhatt and Ranbir Kapoor wedding to have only 28 guests అలియా-రణబీర్ పెళ్ళికి గెస్ట్ లు లేరా
Advertisement
Ads by CJ

అలియా భట్ పెళ్లి కూతురు కావడానికి ఎన్నో రోజులు లేవు. ఈ నెల 17 న అలియా భట్ - రణబీర్ వివాహం జరగబోతుంది. రణబీర్ కానీ ఆయన ఫ్యామిలీ కానీ, ఇటు అలియా కానీ ఆమె ఫ్యామిలీ కానీ పెళ్లి విషయాలు బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే అలియా భట్ - రణబీర్ పెళ్ళికి బాలీవుడ్ నుండి 400 మంది అథిదులు.. సెలబ్రిటీస్, అలాగే రిలేటివ్స్ హాజరవుతారని, ముంబై లోనే రణబీర్ కపూర్ ఫ్యామిలీ మహల్ లో వీరి పెళ్ళికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరగబోతున్నాయని అన్నారు.

కానీ అలియా భట్ బ్రదర్ రాహుల్ భట్ మాత్రం అలియా భట్ - రణబీర్ కపూర్ పెళ్ళికి కేవలం కొద్దిమంది అథిదులు మాత్రమే అంటే 28 మంది అతిథులు మాత్రమే  వస్తున్నట్టుగా చెబుతున్నారు. అలాగే వీరంతా దగ్గర బంధువులు మాత్రమే అని, ఆ బంధువులు అంతా బస్సు లో అలియా భట్ పెళ్లి జరగబోయే చెంబూర్ కు వస్తారని రాహుల్ భట్ చెబుతున్నాడు. ముంబై లోని చెంబూర్ లో రణబీర్ కపూర్ నివాసంలో వివాహం జరగనున్నట్టు గా తెలుస్తుంది. అలియా భట్ పెళ్ళికి కావాల్సిన డ్రెస్ ని మనీష్ మల్హోత్రా సబ్యసాచి డిజైనర్లు తో కలిసి డిజైన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఏప్రిల్ 15 నుండే అలియా భట్ పెళ్లి వేడుకలు మొదలు కాబోతున్నాయని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.

Alia Bhatt and Ranbir Kapoor wedding to have only 28 guests:

Alia Bhatt and Ranbir Kapoor wedding to have only 28 guests, reveals Rahul Bhatt

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ