సూపర్ స్టార్ మహేష్ బాబు - పరశురామ్ కలయికలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. కరెక్ట్ గా ఈ సినిమా మరొక్క నెలలో అంటే ఈ రోజు ఏప్రిల్ 12. నెల తిరిగేసరికి అంటే మే 12 న సర్కారు వారి పాట రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కున్న ఈ భారీ చిత్రానికి సంబధించిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులని అలరిస్తుంది. సెన్సేషనల్ సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్ బస్టర్స్ గా రికార్డులు సృష్టించాయి.
మొదటి పాటగా విడుదలైన కళావతి మళ్ళీ మళ్ళీ పాడుకునే పాటగా నిలిచి రికార్డ్ వ్యూస్ ని సొంతం చేసుకొని మ్యూజికల్ ప్రమోషన్స్ కు అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వగా, సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె ప్రిన్సెస్ సితార ఘట్టమనేని ఫస్ట్ అప్పియరెన్స్ తో వచ్చిన రెండో పాట పెన్ని సాంగ్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సితార క్యూట్ అండ్ ట్రెండీ డ్యాన్స్ లతో ప్రేక్షకులని మెస్మైరైజ్ చేసింది. సితార అప్పియరెన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది.
ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రమోషన్స్ కు సన్నాహాలు చేస్తుంది. మిలిగిన ఒక పాటను త్వరలోనే చిత్రీకరించనున్నారు. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్న ఈ చిత్రం మే 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. సినిమా విడుదలకు సరిగ్గా నెల రోజులు వుండటంతో చిత్ర యూనిట్ రెగ్యులర్ అప్డేట్స్ తో ముందుకొస్తున్నారు.ఇప్పటికే రెండు పాటలు సూపర్ హిట్స్ కావడంతో ఆల్బమ్ లో మరో సూపర్ హిట్ పాట కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. దీంతో పాటు సినిమా విడుదలకు ముందు యూనిట్ చాలా ప్రమోషనల్ ఈవెంట్స్ ని జరుపుకోనుంది.