Advertisementt

ఆచార్య: కామ్రేడ్ అంటూ తండ్రి కొడుకుల రచ్చ

Tue 12th Apr 2022 06:39 PM
acharya,chiranjeevi,ram charan,chiru acharya,koratala shiva,acharya trailer  ఆచార్య: కామ్రేడ్ అంటూ తండ్రి కొడుకుల రచ్చ
Acharya Release Trailer released ఆచార్య: కామ్రేడ్ అంటూ తండ్రి కొడుకుల రచ్చ
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి - సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల కలయికలో క్రేజీ మూవీ గా తెరకెక్కిన ఆచార్య ఈ నెలలోనే మెగా ఫాన్స్ కి ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతుంది. మెగాస్టార్ తో ఆయన కొడుకు రామ్ చరణ్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆచార్య కి మెయిన్ అసెట్. అందుకే సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఇక ఈ రోజు ఆచార్య ట్రైలర్ రిలీజ్ తో టీం ప్రమోషన్స్ ని అఫీషియల్ గా మొదలు పెట్టింది. అటు థియేటర్స్ లోను, ఇటు యూట్యూబ్ లోను ఆచార్య ట్రైలర్ ని లాంచ్ చేసింది టీం. కాజల్ అగర్వాల్, పూజ హెగ్డే హీరోయిన్స్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో సిద్ద గా రామ్ చరణ్, ఆచార్య గా చిరు లుక్స్ అలాగే ఆచార్య టీజర్ అన్ని విపరీతంగా ఆకర్షించాయి. ఇక తాజాగా విడుదలైన ఆచార్య ట్రైలర్ లోకి వెళితే.. 

పచ్చని అడవులని చూపిస్తూ.. ఆచార్య కోసం వేసిన అతి పెద్ద టెంపుల్ సెట్ లో రామ్ చరణ్ సిద్ధగా, పూజ హెగ్డే నీలాంబరి లను చూపిస్తూ అందంగా స్టార్ట్ చేసారు. తర్వాత చరణ్ యాక్షన్ సీక్వెన్స్ తో ట్రైలర్ మొదలయ్యింది. కష్టాలు వచ్చినప్పుడు అమ్మోరు తల్లి మీద భారం వేసి బిక్కుబిక్కుమంటూ ఉంటామనుకుంటే పొరబాటు పడొచ్చు.. ఆపదొస్తే.. ఆ అమ్మోరు తల్లే మమ్మల్ని ఆవహించి ముందుకు పంపుద్ది.. ధర్మస్థలి అధర్మస్థలి ఎలా అవ్వుద్ది అంటూ సిద్ద గా రామ్ చరణ్ పవర్ ఫుల్ లుక్ చెప్పే డైలాగ్ కి మెగా ఫాన్స్ కి పూనకాలే.  

ఇక మెగాస్టార్ ఎంట్రీ అడవుల్లో యాక్షన్ ఎపిసోడ్ తో పవర్ ఫుల్ టైగర్ లా చూపించారు. విలన్ సోను సూద్ తో చిరు చెప్పే డైలాగ్స్, కామ్రేడ్ అంటూ ఆచార్య గా చిరు సిద్దాని పిలిచే పిలుపు, అక్కడ తండ్రి చేతిపై చరణ్ కాలు వేసి దూకుతూ రౌడీలని చితక్కొట్టే యాక్షన్ సీన్ ఫాన్స్ కి గూస్ బమ్ప్స్ తెచ్చేదిలా ఉంది. చరణ్, చిరు యాక్షన్ సీన్స్, తండ్రి కొడుకులు కలిసి వేసే డాన్స్ స్టెప్స్ అన్ని చాలా కూల్ గా, పవర్ ఫుల్ గా వున్నాయి. మణి శర్మ బ్యాగ్రౌండ్ స్కోరు, సినిమాటోగ్రఫీ, కొరటాల మేకింగ్ విజువల్స్ అన్ని ఆచార్య కి హైలెట్ అనేలా ఉన్నాయి.

ఆచార్య ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 

Acharya Release Trailer released :

Chiru - Charan Acharya Release Trailer released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ