Advertisementt

అక్కడ డబుల్ పేమెంట్స్.. ఇక జబర్దస్త్ వద్దు

Wed 13th Apr 2022 11:04 AM
comedy stars,jabardasth,trp ratings,stara comedians,jabardasth comedy  అక్కడ డబుల్ పేమెంట్స్.. ఇక జబర్దస్త్ వద్దు
Jabardasth vs Comedy Stars అక్కడ డబుల్ పేమెంట్స్.. ఇక జబర్దస్త్ వద్దు
Advertisement
Ads by CJ

గత కొన్ని రోజులుగా జబర్దస్త్ నుండి చాలామంది కమెడియన్స్ షో ని వదిలేసి వెళ్ళిపోయి పక్క ఛానల్ స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ లో కామెడీ చేసుకుంటున్నారు. జబర్దస్త్ లో కమెడియన్స్ ఆల్మోస్ట్ ఖాళీ అయ్యారు. అదిరే అభి, అప్పారావు, ఆర్పీ, ధనరాజ్, అవినాష్ ఇలా చాలామంది జబర్దస్త్ ని వదిలేసారు. అయితే కామెడీ స్టార్స్ కి ఒక్కసారిగా జబర్దస్త్ ని వదిలి క్యూ కట్టడానికి కారణం.. జబర్దస్త్ పారితోషకం కన్నా డబుల్ పేమెంట్స్ ఉండడమేనట. జబర్దస్త్ లో ఉన్న రెమ్యునరేష్ ని కి డబుల్ పారితోషకాలు ఇచ్చి మరీ కామెడీ స్టార్స్ కోసం కమెడియన్స్ ని లాగేసినట్లుగా రీసెంట్ గా అప్పారావు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా అర్ధమైంది.

ఓం కార్ ఆధ్వర్యంలో నడుస్తున్న కామెడీ స్టార్స్ లో కనిపిస్తున్న కమెడియన్స్ అంతా జబర్దస్త్ కన్నా డబుల్ పేమెంట్స్ అందుకోవడంతోనే ఇక జబర్దస్త్ కి వెళ్లే సూచనలు కనిపించడం లేదు. కామెడీ స్టార్స్ రేటింగ్ కూడా బావుంది అంటూ చాలామంది చెబుతున్నారు. అలా గత కొన్నేళ్లుగా రారాజుగా సాగుతున్న జబర్దస్త్ షో కి ఇలా డబుల్ పేమెంట్స్ తో చెక్ పెట్టి.. మరీ కమెడియన్స్ ని పడేస్తుంది స్టార్ మా. ఇకపై జబర్దస్త్ లో కొనసాగుతున్న ఆ కొంతమంది కమెడియన్స్ కూడా కామెడీ స్టార్స్ లోకి వచ్చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదేమో..

Jabardasth vs Comedy Stars:

Comedy Stars Vs Jabardasth shocking TRP ratings

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ