ట్రిపుల్ ఆర్ తో రామ్ చరణ్ పాన్ ఇండియా హిట్ కొట్టడమే కాదు.. ఆ సినిమాలో రామ్ చరణ్ పెరఫార్మెన్సు కి విమర్శకుల సైతం ప్రశంశలు కురిపించారు. దానితో మెగా ఫాన్స్ చాలా హ్యాపీ గా ఉన్నారు. ఇక సైరా నరసింహ రెడ్డి తర్వాత మెగాస్టార్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తో ఆచార్య అంటూ సినిమా చేసారు. మూడేళ్ళుగా సెట్స్ మీదున్న ఈ సినిమా ఈ నెలలోనే రిలీజ్ కి రెడీ అయ్యింది. ఈ సినిమాలో చరణ్ తండ్రి చిరు తో స్క్రీన్ షేర్ చేసుకోవడంతో అంచనాలు పెరిగిపోయాయి. మెగా ఫాన్స్ కూడా ఆచార్య టీజర్ క్రియేట్ చేసిన రికార్డ్స్ తో ఫుల్ హ్యాపీ గా ఉన్నారు. చరణ్ - చిరు.. పులి, చిరుత పులిలా ఉన్నారు, సినిమా సూపర్ హిట్ అంటూ కలలు కంటున్నారు. కానీ తాజాగా ఆచార్య ట్రైలర్ చూసిన మెగా ఫాన్స్ కి టెంక్షన్ స్టార్ట్ అయ్యింది.
ఈ సినిమా ట్రైలర్ చూస్తే రొటీన్ ఫార్ములాతో చరణ్ - చిరు లతో కొరటాల శివ యాక్షన్ చేయించారు. సినిమా మొత్తం ఈ యాక్షన్ కనిపిస్తుంది. చరణ్ - చిరు సీన్స్ తప్ప సినిమాలో పెద్దగా హైలెట్ అయ్యే అంశాలు కనిపించేలా లేవు... నక్సలైట్ ఎపిసోడ్ కూడా సో సో గానే ఉండేలా ఉంది.. వాళ్ళ లుక్స్, ఆ యాక్షన్ ఎపిసోడ్ ఏమైనా హైప్ ఇస్తుందేమో.. కానీ ధర్మస్థలిలో యాక్షన్ ఎపిసోడ్ రొటీన్ గా కనిపిస్తుంది. చిరు ఫేస్ లో ఎక్సప్రెషన్స్ మిస్ అవుతున్నాయి.. కొరటాల శివ దర్శకత్వంలో ఏదో మిస్ అయ్యింది అంటూ చాలామంది ఆచార్య ట్రైలర్ ని విమర్శిస్తున్నారు. ఆచార్య ట్రైలర్ చూస్తున్నంతసేపు.. ఓకె ఏదో ఉందిలే.. అనుకున్నంత లేదుగా అంటూ వీక్షకులు పెదవి విరుస్తున్నారు. దానితో మెగా ఫాన్స్ లో టెంక్షన్ మొదలైంది. సినిమా విడుదలకు ముందు ఇలాంటి ట్రైలర్ వదిలేరేంటి.. ఈ ట్రైలర్ తో సినిమాకి భారీ ఓపెనింగ్స్ వస్తాయా అని భయాపడుతున్నారు.