విజయ్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన బీస్ట్ మూవీ నేడు తమిళ సంవత్సరాది స్పెషల్ గా రిలీజ్ చేసారు. అయితే బీస్ట్ మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ షో కాదు ఓవర్సీస్ ప్రీమియర్స్ నుండే నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. విజయ్ హీరోయిజం, అనిరుధ్ మ్యూజిక్ తప్ప సినిమాలో ఇంకేమి లేదు అంటూ సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు మాట్లాడుకుంటున్నారు. అటు విజయ్ ఫాన్స్ కోసమే నెల్సన్ విజయ్ తో సినిమా తీసినట్టుగా హీరోయిజం సీన్స్ ని హైలెట్ చేసారు. కానీ బీస్ట్ అటు విజయ్ ఫాన్స్ ని కూడా మెప్పించలేకపోయింది. ఎన్నో అంచనాల మధ్యన ఎంతో ఆతృతగా సందడి చేస్తూ థియేటర్స్ కి వెళ్లిన ఫాన్స్ కి బీస్ట్ చూసి షాక్ తగిలింది.
ఇక విజయ్ - పూజ హెగ్డే, సెల్వ రాఘవన్ తప్ప సినిమాలో మిగతా కేరెక్టర్స్ కి స్కోప్ లేదు. పెద్ద నటులని తీసుకోలేదు. ఏదో డాక్టర్ మూవీ లోలా చిన్న చిన్న నటులతో విజయ్ బీస్ట్ చుట్టేశాడు దర్శకుడు. పెద్ద హీరోయిన్ పూజ హెగ్డే ని పట్టుకొచ్చి ఆమెకి అసలు స్కోప్ లేకుండా చేసాడు. హీరో ని ధీటుగా ఎదుర్కునే విలన్ ని పెట్టలేదు. ఇవన్నీ విజయ్ ఫాన్స్ కి నచ్చలేదు. సినిమా రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే పూర్ రివ్యూలతో సోషల్ మీడియాని షేక్ చేసారు క్రిటిక్స్. దానితో సోషల్ మీడియాలో అప్పుడే #BeastDisaster హాష్ టాగ్ ట్రెండ్ చేస్తున్నారు విజయ్ యాంటీ ఫాన్స్. బీస్ట్ రిలీజ్ అయిన కొన్ని గంటలకే #BeastDisaster హాష్ టాగ్ ట్రేండింగ్ లోకి వచ్చేసింది. మరి సినిమా ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో ఇంత నెగిటివిటీని ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో కానీ.. ఈ ప్రభావం బీస్ట్ కలెక్షన్స్ పై పడడం పక్కాగా కనబడుతుంది.